కరోనా వైరస్ ఏమని వచ్చిందో కానీ అప్పటినుండి మానవాళి జీవన శైలిని పూర్తిగా కాదు వారి భవిష్యత్తును కూడా రూపు రేఖలు లేకుండా నాశనం చేస్తోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా హోటల్స్, థియేటర్లు, షాపింగ్ మాల్స్  ఇలా ఎన్నో కరోనా కారణంగా మూతబడి ఆర్థికంగా కుంగిపోయాయి. దీంతో ఉద్యోగస్తులు సంపాదన  లేక రోడ్డున పడ్డారు. ఎంతో మంది జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయాయి. మరో  వైపు కొత్త ఉద్యోగాలు దొరక్క జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇలా భారీ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు దాదాపుగా అన్ని ఆగిపోవడంతో లక్షమంది తమ ఉపాధిని కోల్పోయారు. ఒక్క మే నెలలోనే భారతదేశంలో కొన్ని  మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. 

ఈ రకంగా కరోనా ప్రజల భవిష్యత్తుపై తీరని భారాన్ని రోజురోజుకీ పెంచుతోంది. అయితే తాజాగా అందిన మరో వార్త మరింత ఆందోళన పెంచుతోంది. కర్ణాటకలో మహా నగరం అయిన బెంగుళూరులో కరోనా ఎఫెక్ట్ తో లక్షమందికి పైగా తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఎంతో మంది వారికి ఉన్న ఆస్తులను విక్రయించి తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. కరోనా కారణంగా తమ ఉపాధిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ఈ క్రమంలో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లేఖను రాసింది. అందులో తమకు ప్రభుత్వం సాయం కోరుతూ వారి బాధలను విన్నవించింది. ప్రభుత్వాలు ముందుకు వచ్చి తమను ఆర్థికంగా రక్షించాలని కోరింది.

గుజరాత్ రాష్ట్రంలో నష్టపోయిన షాపింగ్స్ కు ఇచ్చిన రాయితీలనే ఇక్కడ కూడా కల్పించి ఆదుకోవాలంటూ, తమ  జీవితాలకు కేంద్రం కల్పించాలంటూ లేఖలో పేర్కొంది. గుజరాత్ లో అధికారంలో ఉన్నది బీజెపీ సర్కారు అయితే అక్కడ కల్పించిన రాయితీలు సహాయసహకారాలు ఇక్కడ వారికి కూడా అందించాలని తమ జీవితాలను ఆదుకోవాలని బెంగుళూరు ప్రభుత్వాన్ని సవినయంగా కోరాయి బెంగుళూరు షాపింగ్ యాజమాన్యాలు. మరి ఈ విషయంలో బెంగుళూరు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: