ప్రతి సంవత్సరం ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అంటూ ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ ఊసే ఎత్తలేదు. దీంతో నిరుద్యోగులు అందరూ నిరాశలో మునిగిపోయారు.  జగన్ హామీ నిలబెట్టుకుని ఇక కోరిక తీరుస్తారా లేదా అని ఎంతగానో ఆందోళన చెందారు. ఇదిగో ప్రకటిస్తాం.. అదిగో ప్రకటిస్తామని తప్ప ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు.



 ఏపీలో ప్రభుత్వం ఎప్పుడూ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూసారు నిరుద్యోగులు. ఇటీవలే నిరుద్యోగులు  అందరిని సంతోష పరుస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 2022 వరకు భర్తీచేసే పదివేల 143 ఉద్యోగుల వివరాలను పొందుపరుస్తూ ఇటీవలే సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఇక ఈ ఉద్యోగాల భర్తీలో ఎక్కడ అవినీతికి వివక్షతకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎన్నో ఏళ్ల నుంచి నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు వైయస్ జగన్.



 ఇక మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది అంటూ తెలిపారు. నిరుద్యోగులు మనోధైర్యం కోల్పోకుండా ఇక వేగంగా ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. గత పరీక్షల్లో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఏ నెలలో ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేస్తుందో అనే విషయంపై నిరుద్యోగులు అందరిలో అవగాహన ఉండేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. నిరుద్యోగ యువకుల్లో సేవాభావం తెచ్చేందుకు వాలంటీర్  వ్యవస్థను తెచ్చామని... గ్రామ సచివాలయం లో 1.22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వం పై భారం పడుతుందని తెలిసినప్పటికీ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసామంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: