ఇక ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ దాడి చేసిన సమయంలో ఏకంగా భారత్ పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఎదురు దాడి చేసింది. ఇక ఇప్పుడు మరో సర్జికల్ స్ట్రైక్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవలే త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక పాకిస్తాన్ భారత్ పై డ్రోన్ల దాడి గురించి మాట్లాడుతూ.. ఒకవేళ పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లతో దాడికి దిగితే.. ఊహించని విధంగా ఎదురు దాడి చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు. సరైన సమయం ప్రాంతం చూసుకొని భారత్ ఎదురు దాడికి దిగుతుంది అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఇటీవలే జూన్ 27వ తేదీన అంతర్జాతీయ సరిహద్దు కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత ఎయిర్ బేస్ పై రెండు డ్రోన్ లతో బాంబుల దాడి చేసారు. ఇక ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉందా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం పై దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి దిగినట్లు తేలితే ఇక పాకిస్తాన్ను ధీటుగా ఎదుర్కునేందుకు భారత్ ఎప్పుడు ఎప్పుడూ సంసిద్ధం గానే ఉంటుంది అంటూ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే దీటుగా బదులు ఇవ్వడం ఖాయం అంటూ బిపిన్ రవాట్ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి