వివరాల్లోకి వెళితే.. రహ్మత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ పోచమ్మ ఆలయం సమీపంలో శ్రీ అనూష రెసిడెన్సీ ప్రహరీ కూడా ఉంది. అయితే కోట్ల రూపాయలతో అపార్ట్మెంట్ నిర్మించిన నిర్మించిన యాజమాన్యం అటు ప్రహరీ గోడ నిర్మాణంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. సిమెంట్ తో కాకుండా కేవలం మట్టి తో ప్రహరీగోడ నిర్మించారు. అయితే ఇటీవలే ఆశిష్ ఇక వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రహరీ గోడ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఊహించని విధంగా మట్టితో కట్టిన ప్రహరీ కూడా ఒక్కసారిగా అతని పై కూలిపోయింది. ఆ సమయంలో స్థానికులు ఎవరు గమనించలేదు. అయితే వర్షం పడుతుండడంతో ఎవరి ఇంట్లో వారు ఉండిపోయారు. ఇక సహాయక సిబ్బంది కూడా ఉదయాన్నే సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఉదయం సమయంలో ఇక మట్టిని తొలగిస్తూ ఉండగా ఒక యువకుడి మృతదేహం లభించింది. అప్పటికే వాకింగ్ కి వెళ్ళిన తమ్ముడు కనిపించడం లేదు అంటూ ఆశిష్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆశిశ్ దిగా గుర్తించారు. అయితే రోజు వాకింగ్ కోసం వస్తూ ఇక అదే అపార్ట్మెంట్లో ఉండే మిత్రున్ని కలుస్తూ ఉంటాడు ఆశిష్. రోజు లాగానే ఆ రోజు కూడా వచ్చాడు కానీ మృత్యువు ఆ గోడ చాటున దాక్కొని ఉంది అనే విషయాన్ని మాత్రం గమనించలేకపోయారు. ఒక్కసారిగా గోడ కూలడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అపార్టుమెంటు వాసులు నిర్లక్ష్యం కారణంగానే గోడకూలి ఆశిష్ చనిపోయాడని ప్రస్తుతం స్థానికులు ఆరోపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి