ఇప్పటి వరకూ బయటపడిన వైరస్ రకాలన్నిటిలో కరోనా భలే డేంజర్ అని అంటారు. మానవ శరీర కణజాలాల్లో చొచ్చుకుపోయి, మన రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి, మనకు నష్టం కలుగజేస్తుంది కరోనా వైరస్. తడి తగిలితే చాలు అమాంతం తన సంతతి వృద్ధి చేసుకుంటూ విజృంభిస్తుంది. అంతే కాదు, రకరకాల వేరియంట్లతో ముప్పతిప్పలు పెడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే, అంతకంటే జిత్తులమారి వైరస్ ఇంకోటి కావాలంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే అమెరికాలో దీని విరుగుడుకోసం కృత్రిమ కరోనా వైరస్ ని తెరపైకి తెచ్చారు. ఇది అసలు వైరస్ ని చంపేసి, ఆ తర్వాత తను కూడా శరీరం నుంచి మాయమవుతుంది.
కరోనా పునరుత్పత్తిపై దెబ్బ.. డిఫెక్టివ్ ఇంటర్ ఫియరింగ్ (డీఐ) వైరస్ పేరుతో దీన్ని పెన్సిల్వేైనియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ వైరస్ లో పునరుత్పత్తికి కావాల్సిన జన్యువులు ఉండవు. దీన్ని మానవుల శరీరంలో ప్రవేశ పెడితే, వారి శరీరంలో అప్పటికే కరోనా వైరస్ ఉండి ఉంటే.. దాని సాయంతో మాత్రమే పునరుత్పత్తి కాగలుగుతుంది. దీనికోసం కరోనా వైరస్ జన్యురాశిలోని పునరుత్పాదక యంత్రాంగాన్ని ఇది వాడుకుంటుంది. అంటే ఒకరకంగా కరోనా వైరస్ ని ఉత్పత్తి కాకుండా నిరోధిస్తూ.. దాని స్థానంలో ఇది వేగంగా ఉత్పత్తి చెందుతుంది. ఈ డీఐ వైరస్ ఎక్కువయినా కూడా శరీరానికి హాని ఉండదు కాబట్టి దీనితో ఇబ్బంది ఉండదు. అదే సమయంలో కరోనా వైరస్ వృద్ధి మాత్రం ఆగిపోతుంది, దాని లోడు తగ్గిపోతుంది, తద్వారా కరోనాకి చెక్ పెట్టినట్టవుతుంది. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న పెన్సిల్వేనియ్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు త్వరలోనే మంచి ఫలితాలనిస్తాయని అంటున్నారు. ఈ డూప్లికేట్ వైరస్ అందుబాటులోకి వస్తే కరోనా వైద్యంలో మరో పురోగతి సాధించినట్టే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి