వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయ్. ముఖ్యంగా  హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గతేడాది కరోనా వైరస్ కారణంగా గణేష్ ఉత్సవాలు తూతూమంత్రంగా జరిగిపోయాయి. కానీ ఈ ఏడాది మాత్రం అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఇటీవలే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇటీవలే సమావేశం నిర్వహించారు.  ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది గణేష్ ఉత్సవాల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి.



 వైరస్ వ్యాప్తి దృశ్య ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు ఎన్నో జాగ్రత్తలు మధ్య నిర్వహిస్తామంటూ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఇక ఈ నెల 23వ తేదీన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఓపెన్ చేస్తాం అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10 నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఇక నిమజ్జనం ప్రక్రియ సెప్టెంబర్ 19 వ తేదీన  ఆదివారం రోజున జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ప్రభుత్వం రా మెటీరియల్ టైం కి ఇవ్వాలని ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ కోరింది.



 గణేష్ ఉత్సవాలకి 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నాము అంటూ స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల్లో గణేష్ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి వారు వెంటనే రోడ్లు బాగు చేయాలి అంటూ ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరింది. గణేష్ నిమజ్జనం సమయానికి రోడ్లు బాగూ అయ్యేలా  చూడాలి అంటూ విజ్ఞప్తి చేసింది. ఇక అందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది. ఇక గణేష్ ఉత్సవాల సమయంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి ఇక దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలనే ప్రతిష్టాస్తామని ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తెలిపింది  ఇక గణేష్ ఉత్సవ కమిటీ కి అందరు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: