ఇటీవలి కాలంలో దేశంలో వరకట్న వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఓవైపు అందరూ ఆధునిక జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరు  పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు.   మహిళలు కూడా ఏకంగా మహిళా సాధికారతను చాట్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఇప్పటికి మహిళలకు  వరకట్న వేధింపులు తప్పడం లేదు. రోజురోజుకు మహిళలు వరకట్న వేధింపుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది మహిళలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 అయితే నాగరిక సమాజంలో కూడా వరకట్న వేధింపులు తప్పవా అంటూ అటు మహిళా సంఘాలు కూడా పోరాడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక తాళి కట్టే సమయంలో కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వ్యక్తి కొన్ని రోజుల్లోనే అదనపు కట్నం కావాలంటూ వేధించడం మొదలు పెడుతున్నారు. అయితే ఇలా రోజురోజుకీ వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వరకట్న వేధింపులపై ఇటీవల కేరళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఏకంగా విద్యార్థులతో కట్నం తీసుకోము అంటూ ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేయించాలి అంటూ కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు.



 విద్యార్థులు వరకట్నం అనే సాంఘిక దురాచారాన్ని రూపుమాపేందుకు నడుం బిగించాలి అంటూ ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్  పిలుపునిచ్చారు. ఇందుకోసం విద్యార్థులందరూ యూనివర్సిటీలో వివిధ చదువుల కోసం చేరే సమయంలో మేము ఇక భవిష్యత్తులో కట్నం తీసుకోబోమని అంటూ విద్యార్థులు అందరితో  ఒక బాండ్ పేపర్ పైన సంతకం చేసేలా చూస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా విద్యార్థి దశలోనే బాండ్ పేపర్ పైన సంతకం చేయడం వల్ల ఇక దేశంలో కనీసం కొంత మేరకైనా సరే అటు వరకట్నపు చావులు ఆపేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాంటీ ర్యాగింగ్  బాండ్ మాదిరిగానే యాంటీ డౌరి బాండ్ కూడా తీసుకు వస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్.

మరింత సమాచారం తెలుసుకోండి: