కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో పథకాలు ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎన్నో.  అయితే మోడీ ప్రభుత్వ పాలన నచ్చి దేశ ప్రజానీకం మొత్తం మరోసారి మోడీకే పట్టం కట్టారు. దీంతో రెండవసారి కూడా ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యారు నరేంద్ర మోడీ. ఇక ప్రతి విషయంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం.



 ప్రస్తుతం మోడీ అమిత్ షా ద్వయం భారత్లో అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని విధంగా ముందుకు తీసుకెళుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు హిందూత్వ ఎజెండా మరోవైపు అభివృద్ధిని రెండు పట్టాల మీద నడిపించే  విధంగా ముందుకు సాగింది బిజెపి ప్రభుత్వం. దేశ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి కి మంత్ర ముగ్ధులై రెండవసారి పట్టం కట్టారు. అయితే ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.




 సుదీర్ఘకాలం పాటు  ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం అయోధ్య,కాశి, మధుర, చిత్రకూట్, వింధ్యాచల్ ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు భయంతో అభివృద్ధి అనే విషయాన్ని మర్చిపోయాయి.  మైనార్టీలకు సంతృప్తిపరచడం కోసం అభివృద్ధి విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయి.  కానీ వాటిని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. తమ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీ కాదని..  యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళను చూస్తే ఓ వైపు అభివృద్ధి చేయడంతో పాటు మరోవైపు మతసామరస్యాన్ని పాటిస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అంటూ అమిత్ షా తెలిపారు. మా ప్రభుత్వ విధానాన్ని గమనించి మాకు ఓటు వేయండి అంటూ ఇటీవల అమిత్ షా చేసిన ఒక స్టేట్మెంట్ కాస్త రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ప్రతీక అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: