ఏకంగా భారత స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి.. స్వతంత్ర భారతానికి కారణమైన ఎంతోమంది కలల భారతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పేదోడు ధనికుడు అనే తేడా లేకుండా అందరికీ సమన్యాయం సత్వర న్యాయం.. సామాజిక జీవనానికి పునాది సమన్యాయం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపి బ్రతికించేవి కోర్టులు. తప్పు చేసినప్పుడు సత్వరంగా శిక్షలు పడినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అలా జరగాలన్నదే నాడు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారి కల కోర్టులలో సత్వర న్యాయం జరిగినప్పుడే తప్పులు చేసే వాళ్ళు కూడా తగ్గుతారు ఒక్క కేసు కూడా పెండింగ్లో ఉండకుండా సత్వర న్యాయం జరిగి కోర్టులపై అందరికీ నమ్మకం తీసుకురావడమే నాడు ప్రాణాలు అర్పించిన వారి కలల భారతం.
అయితే ఈ కలల భారతం నేటికీ ఒక కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. కేవలం నాడు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మాత్రమే కాదు.. ప్రస్తుతం 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బ్రతుకుతున్న వారి కలల భారతం కూడా ఇదే. ప్రతి కేసులో కూడా సత్వరంగా న్యాయం జరిగి తప్పు చేసినవాడికి శిక్ష పడడం.. ఇలా జరగడం వల్ల నేరాలు చేయాలనుకునే వారిలో కూడా భయం పడుతుంది. దీంతో నేరాలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. తద్వారా నాడు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారు నేడు స్వతంత్ర భారతంలో బ్రతుకుతున్న వారి కలల భారతం నిజం అవుతుంది . ఈ కలల భారతాన్ని నిజం చేయాలంటే ప్రతి పౌరుడు పట్టువిడవకుండా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి