ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం కొనసాగుతున్న చిన్న సినిమాల హవాలో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిన్న మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ కూడ ధియేటర్లలోనే రాబోతోంది ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు ఊహించని హిట్స్ గా మారుతున్న పరిస్థితులలో తన మూవీ కూడ హిట్ అవుతుందని నమ్మకం పెట్టుకుని సుశాంత్ ఆసినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ అల్లు అర్జున్ వల్ల తనకు కలిగిన జ్ఞానోదయాన్ని వివరించాడు. ‘అలవైకుంఠ పురములో’ అల్లు అర్జున్ తో నటిస్తున్నప్పుడు తనకు బన్నీ ఎన్నో విషయాలు చెప్పాడని హీరోగా కెరియర్ లో ఎదగాలి అంటే ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి అన్న విషయాలతో పాటు నటనకు సంబంధించిన కొన్ని టిప్స్ కూడ బన్నీ తనకు ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ అతడి దర్శకత్వంలో నటించాలి అన్నది తన కల అనీ ఆ కల ‘అలవైకుంఠ పురములో’ తీరింది అంటున్నాడు. క్రైమ్ లవ్ ఎమోషన్స్ తో నేటితరం అభిరుచులకు తగ్గట్టుగా తీయబడ్డ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మూవీ అందరికీ నచ్చుతుంది అని చెపుతూ ధియేటర్లలో సినిమాలు చూసినప్పుడు వచ్చే ఆనందం ఓటీటీ సినిమాలలో రాదు అంటూ ధియేటర్లకే ఓటు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి