దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిర్దేశించిన పథకం ఇప్పుడిప్పుడే అర్హుల వడపోత తరువాత నగదు చెల్లింపు అనే ప్రక్రియల్లో భాగంగా సంబంధిత చర్యలను పూర్తి చేసుకుంటోంది. గ్రామాల్లో కూడా ఉపాధిపై పెద్దగా అవగాహన లేని కారణంగా వారికి ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేయాలన్న కేసీఆర్ ఆలోచన అన్నది అమలుకు నోచుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతున్నా, డీఆర్డీఏ మాత్రం కొన్ని కంపెనీలతో చర్చలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పశుపోషణ, డైరీ నిర్వహణే ధ్యేయంగా ఆలోచిస్తున్న లబ్ధిదారులను గైడ్ చేసేందుకు మేలు జాతి పశువుల కొనుగోలు, వాటి రక్షణ, పాల అమ్మకాలు వీటిపైనే అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. డబ్బులు వృథా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు.
కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే దళిత బంధు పథకం అమలు అన్నది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అయింది. గ్రామా లలో ఉపాధికే ప్రాధాన్యం ఇవ్వాలని, డబ్బు వేరే పనులకు ఖర్చుచేయకూడదని కలెక్టర్ స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు.కొందరు డెయిరీ రంగంపై ఆశలు పెంచుకుంటున్నారు. మరికొందరు ట్యాక్సీ సర్వీసులు నడిపేందుకు ఇస్టపడుతున్నారు. వీరికి సరైన మార్గ దర్శకత్వం చేసే వారు లేక కొంత గందరగోళం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అర్హుల ఎంపిక సొమ్ము చెల్లింపుపైనా అధికారులు ఆలోచనలు ఉన్నాయి. వీటి తరువాత ఆ డబ్బుతో వీరికి ఉపాధి ఎలా దక్కుతుంది అన్న విషయమై దృష్టి అన్నది సారించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఈ పథకం ఇక్కడ సక్సెస్ అయ్యాక మరో నాలుగు మండలాల్లో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి సంబంధించి ఆరోపణలు ఎలా ఉన్నాయో, వాస్తవాలూ అలానే ఉన్నాయి. కేసీఆర్ ఈ పథకం అర్హులందరికీ వర్తింపజేయాలని సంకల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లబ్ధిదారులు డబ్బులు వృథా చేయకుండా ఉండేందుకు కలెక్టర్ల పర్యవేక్షణ కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీం తో గ్రామాలలో తమకు అందే దళిత బంధు నిధులలో (నిర్దేశిత పదిలక్షలలో రక్షణ నిధి కింద మినహాయించుకున్నాక) ఉపాధి మా ర్గాలకే ఈ మొత్తాన్ని వెచ్చించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే 24000 మంది అర్హులు ఉన్న ఈ ప్రాంతంలో 13 వేల మందికి ఈ పథకం వర్తింపజేశామని అధికారులు చెబుతున్నారు. మిగతావారికి త్వరలోనే ఈ పథకం కింద సంబంధిత మొత్తాలు బ్యాంకులో జమ అయ్యేలా వీరి దళిత బంధు ఖాతాలు త్వరిత గతిన తెరచుకునేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి