టిడిపికి కమ్మ సామాజిక వర్గానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గం అంతా టిడిపిని ఓన్‌ చేసుకుందన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఈ సామాజిక వర్గం తెలుగుదేశం కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది. అయితే రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వర్గంలో కొందరు పారిశ్రామికవేత్తలు , దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్నవారు కాంగ్రెస్‌కు సపోర్ట్ గా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో ఈ వ‌ర్గం చంద్రబాబు కు మద్దతుగా నిలిచింది. ఇందుకు కారణం రాష్ట్ర విభజన జరగడం తో పాటు ... చంద్రబాబు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండడంతో ఆయనపై ఉన్న సానుభూతి కూడా ప్రధాన కారణం కావచ్చు.

అయితే 2019 ఎన్నికల నాటికి చాలా మంది నేతలు టిడిపికి దూరమయ్యారు. తమ రాజకీయ , పారిశ్రామిక అవసరాల కోసం కొందరు టీడీపీకి దూరమై జగన్ కు దగ్గర అయ్యారు. చివరకు కమ్మ సామాజిక వర్గం లో తెలుగుదేశం పార్టీని ... నందమూరి కుటుంబాన్ని ఎప్పటినుంచో అభిమానించే వారు కూడా జగన్‌కు జై కొట్టారు అందుకే కమ్మ వర్గం బలంగా ఉన్న కృష్ణా - గుంటూరు జిల్లాల్లో కూడా వైసిపి ఘనవిజయం సాధించింది. అయితే ఈ రెండున్నర సంవత్సరాలలో జ‌గ‌న్‌ ప్రధానంగా కొన్ని కులాల‌ను టార్గెట్ గా చేసుకుని పాల‌న చేస్తున్నార‌న్న‌ విమర్శలు వస్తున్నాయి.

వారిని పదవుల్లోనూ, ప్రాధాన్యతలలోనూ జగన్ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. చివరకు గుంటూరు జిల్లాకు చెందిన క‌మ్మ సామాజిక వర్గానికి చెందిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా తన పక్కన కూర్చోపెట్టుకుంటా నని చెప్పిన జగన్ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. చివరకు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. కమ్మ సామాజిక వర్గ అధికారులకు ప్రమోషన్లలో కూడా వివక్ష చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇక క‌మ్మ వ‌ర్గానికి చెందిన నేతలను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ - దేవినేని ఉమామహేశ్వరరావు - గల్లా జయదేవ్ - దూళిపాళ్ల నరేంద్ర - ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నేతలను టార్గెట్ గా చేసుకుని వారిని కేసుల్లో ఇరికించి లేదా ఇబ్బంది పెట్టటం చేస్తున్నారు. ఈ పరిణామాలతో కమ్మ సామాజిక వర్గంలో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిలో మెజార్టీ వర్గాలు తిరిగి టిడిపి గూటికి చేరుకోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: