ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా... కొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇందులో...  ముందస్తు ఎన్నికలు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఈ మేరకు దృష్టి సారించినట్లు కూడా సమాచారం అందుతోంది.  అంతేకాదు ఈ ఎన్నికల కోసం వ్యూహరచనలు కూడా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ కి అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అయితే ఈ ముందస్తు ఎన్నికల్లో కూడా రాజకీయ వ్యూహం ప్రశాంత్ కిషోర్  ను వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం అందుతోంది. 

ఇప్పటికే ఈ ముందస్తు ఎన్నికల గురించి ప్రశాంత్ కిషోర్ తో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ పనులు కూడా ప్రారంభించిన ఉన్నారట.  అయితే  ఈ నిర్ణయం వెనుక పెద్ద ప్లాన్ వేశారట సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇంత భారీ మెజారిటీ ఉన్న వైసిపి పార్టీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతుందని అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక్కడే తిరకాసు ఉందని తెలుస్తోంది. 2018 సంవత్సరం ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వ్యూహాన్ని రచించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్.  ఒక వేళ కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు తీసుకువస్తే... తమ ప్రభుత్వానికి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో... కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

దీంతో కేసీఆర్ పండిన వ్యూహం విజయవంతమైంది. 2014 ఎన్నికల కంటే భారీ మెజారిటీతో విజయం సాధించింది టిఆర్ఎస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కెసిఆర్ అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ఉద్యోగ కర్త ప్రశాంత్ కిషోర్ టీం ను ఆంధ్రప్రదేశ్లో ముందే దించాలని వ్యూహరచన చేస్తున్నారట.  జమిలి ఎన్నికల కంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అని భావిస్తున్నాడట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక అటు వచ్చే ఎన్నికలను జమిలి ఎన్నికల పద్ధతి ద్వారా...  ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో జగన్మోహన్రెడ్డి సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: