ఏపీలో అధికార వైసీపీకి చెందిన కొంద‌రు నేత‌ల‌పై ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కృష్నా జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య భాను ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాలు మీడియాలో హై లెట్ అవుతున్నాయి. గ‌తంలో ఆయ‌న భార్య హైద‌రాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ఆప‌డంతో నానా ర‌భ స చేశారు. చివ‌ర‌కు ఆమె పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కుమారుడి పెత్త‌నంపై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి ఉద‌య భాను ఆయ‌న కుమారుడి తీరుతో వార్త‌ల్లో నిల‌వాల్సి వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న ఆయ‌న‌కు ఇవ‌న్నీ మైన‌స్ గా మారుతున్నాయ‌ని అధికార పార్టీ నేత‌ల మ‌ధ్యే చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో ఉద‌య‌భాను స్పందించారు. తన కుమారుడిపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని ఆయ‌న‌ వార్నింగ్ ఇచ్చారు. సామినేని ఉదయ భాను కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. అటు జ‌న‌సేన సైతం కొంద‌రు వైసీపీ వాళ్లు గంజాయి వ్యాపారం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌లు త‌న‌కు మైన‌స్ గా మారుతుండ‌డంతో ఉద‌య భాను స్పందించారు.

సోష‌ల్ మీడియా లో త‌న కుమారుడిపై దుష్ప్ర చారం చేస్తోన్న వారిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గంజాయి వ్యాపారాన్ని పనికిరాని వెధవలు, సన్నాసులు చేస్తారని ఉదయభాను విమ‌ర్శించ‌డంతో పాటు త‌న కుమారుడిపై ఇలా ప్ర‌చారం చేసే వారిని వ‌దిలి పెట్ట‌న‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కాపు వ‌ర్గం కోటాలో మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న ఉద‌య భానుకు ఇప్పుడు కొత్త క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టే స్తార‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించు కుంటున్నారు. భాను ఇక‌పై అయినా ఇలాంటి విమ‌ర్శ‌లు త‌న‌పై, త‌న కుటుంబంపై రాకుండా కంట్రోల్ చేసుకుంటారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: