కేసీఆర్ మొన్న ఢిల్లీ వెళ్లి ఆయన కారును అక్కడే వదిలి పెట్టి వచ్చారు. ఇదే ఆయన రాజకీయ చాణుక్యం. ఎప్పుడు ఎక్కడ ఏ అడుగు వేస్తే ఆ  అడుగు పయనం ఎలా సాగుతుందో లక్ష్యం ఎప్పటికీ చేరుకోవచ్చో పక్కా రాజకీయ లెక్కలు తెలిసిన నాయకుడు. అందుకే కారు ఢిల్లీలో వదిలి పెట్టి వచ్చారు. ఆయన ఆలోచనలు, వ్యూహాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడో జరగాల్సిన పనికి ఇప్పటి నుంచే పావులు కదుపుతుంటారు ప్రత్యర్థులు కనీసం టచ్ చేయలేని స్థితిలో పార్టీని నిలబెట్టారు. మాటలు, చేతలు ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేసిన ఆయన మాత్రం క్లారిటీ తో ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కేంద్రంలో మనకు చోటు దక్కచ్చు,కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వమే రావచ్చని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఉన్నట్టుండి కేసీఆర్ ఇలా ఎందుకు మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వెనక వ్యూహమేంటి..? మొన్నటి ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న  అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారా..? 2023 ఎన్నికల నాటికి క్లారిటీ ఇవ్వబోతున్న రా..? అసలు కెసిఆర్ మనసులో  ఏముంది..? ఢిల్లీలో ఏం జరగబోతోందని హైదరాబాద్ టు హస్తినా టూర్ లో దాగున్నా సీక్రెట్ ని డీకోట్ చేసే పనిలో పడ్డాయి రాజకీయ వర్గాలు. ఈ మధ్య మూడు రోజుల గ్యాప్ లో రెండు సార్లు కెసిఆర్ ఢిల్లీ లో పర్యటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి తాను లేకపోయినా సరే చల్తా అనిపించే సమావేశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా తో ఒకే పర్యటనలో రెండుసార్లు వరసబెట్టి భేటీ అయ్యారు. టూర్ షెడ్యూల్ పొడగించారు.

కార్ లో పలుమార్లు ఫుల్ ట్యాంక్ డిజిల్ కొట్టించారు, భేటీలు కంప్లీట్ చేశారు. కెసిఆర్ హస్తిన పర్యటనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపించిన నిజానికి ఢిల్లీలో ఏం జరిగింది. కేంద్రం పెద్దలతో ఏం చర్చించారు రాష్ట్ర ప్రయోజనాలకే  అది పరిమితమా. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఢిల్లీ పెద్దలతో సమావేశాల సారాంశం ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మామూలుగా తప్పదు అనుకుంటే తప్ప ఢిల్లీ వెళ్లిని కేసీఆర్ అసలు ఎందుకు అన్ని రోజులు అక్కడ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: