విజయవాడ పోలీసులు టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేశారు. ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి మరీ టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేశారు. ఏకంగా సీఎం జగన్‌ను బోస్‌డీకే అంటూ పట్టాభి దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఏరా.. రారా.. బానిస, పాలగాళ్లు అంటూ అనేక పరుష పదజాలంతో పట్టాభి సీఎం ను, ఏపీ పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ రాష్ట్రంలో కొత్త సంచలనాలకు కారణమైంది. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి టీడీపీ మంగళగిరి ఆఫీసుతో పాటు అనేక చోట్ల దాడులు చేసిన సంగతి తెలిసిందే.


అయితే.. పట్టాభి అరెస్టును ఆయన ముందే ఊహించారు. అందుకు పట్టాభి ప్రిపేర్‌గానే ఉన్నారు. పట్టాభి ఎంతగా ప్రిపేర్‌ అయ్యారంటే.. పోలీసులు అరెస్టు చేస్తే తనను ఎలాగూ చితక్కొట్టుడు కొడతారని ఆయన ముందే ఊహించారు. అందుకే ముందు జాగ్రత్తగా ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌దే బాధ్యత అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆ వీడియోలో స్పష్టం చేశారు.


ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పట్టాభి వీడియో ద్వారా మీడియాకు చెప్పారు. అంతే కాదు.. మీడియాకు తన కాళ్లు, పొట్ట, వీపు అన్నీ చూపించారు. కేవలం ఓ షార్ట్, షర్ట్ ధరించిన పట్టాభి.. తన అరికాళ్ల దగ్గర నుంచి.. తొడలు.. పొట్ట, వీపు, చేతులు, చేతివేళ్లు అన్నీ చూపించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ తరఫున తాను  పోరాడుతున్నందుకే పోలీసులు తనపై కక్షగట్టారని పట్టాభి ఆ వీడియోలో తెలిపారు.


పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన పట్టాభి.. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి, ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఆ ఘటనకు కారణమైన నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని.. కానీ ఇప్పుడు తనను అరెస్టు చేయడం ఏమేరకు సబబో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని పట్టాభి అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన విధంగానే తనపైనా దాడి చేయాలని పోలీసులు చూస్తున్నారని పట్టాభి ఆరోపించారు. అందుకే.. ఈ వీడియో చేస్తున్నానని పట్టాభి వివరించారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: