ఇక ఇలాంటివారిని అటు కేటుగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారట. పేదరికం లో ఉన్నటువంటి కుటుంబాలకు మీ బిడ్డలకు పెళ్లి చేస్తామంటూ నమ్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా లక్ష నుంచి 5 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తున్నారు ఇక ఆ తర్వాత ఒడిషాకు చెందిన యువతులను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ యువకులకు పెళ్లి చేసుకునేందుకు అమ్మేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో యువకులు పెళ్లి చేసుకోవడానికి కనీసం అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవేళ దొరికినా భారీగా సంపాదించడం బాగా సెటిల్ అయిన వారిని మాత్రమే అక్కడి అమ్మాయిలు కావాలి అనుకుంటున్నారట.
ఈ క్రమంలోనే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లలో అమ్మాయి దొరకకపోవడంతో ఇలా ఎంతోమంది బ్రోకర్ ముఠాలు ఒడిషా నుంచి నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని అమ్మాయిలకు తీసుకెళ్లి ఇక ఇతర రాష్ట్రాలలో యువకులు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని అమ్మేస్తున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది. ఇక ఇటీవల ఏకంగా పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించి కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. ఇక బ్రోకర్ల బండారం బయటపెట్టడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి