చిన్న చిన్న కారణాలు.. తలుచుకుంటేతీరిపోయే సమస్యలు.. ఇలాంటి వాటికి ఐదునేటి రోజుల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే అదే మనుషుల్లో నేటి రోజుల్లో ధైర్యం కనిపించడం లేదు  చిన్నచిన్న కారణాలకే ఏకంగా మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి సమస్యలకే ఇక జీవితం వృధా అని భావించి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి రోజుల్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్న ఘటనలు  ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాఎంతో మంది చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.


 ఇక్కడ ఓ యువతి ఇలాంటి పని చేయ పోయింది. జీవితం మీద విరక్తి తో కఠిన నిర్ణయం తీసుకుంది.  ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులు స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ యువతి ప్రాణాలను కాపాడారు. స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించడంతో మెరుపువేగంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా చివరికి ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.


 హైదరాబాద్లో ఉంటున్న హాసిని అనే యువతి మోడలింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇటీవల మిస్ తెలంగాణ గా కూడా ఎంపిక అయింది. అయితే హిమాయత్ నగర్ లో ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తూనే ఉంది.  ఇటీవలే రాత్రి పదిన్నర గంటల సమయంలో  తల్లిదండ్రులకు స్నేహితులకు ఇంస్టాగ్రామ్ లో వీడియో కాల్ చేసింది. తాను చనిపోతున్నాను అంటూ చెబుతూ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే వెంటనే ఆమె స్నేహితుడు ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. ఇక సమాచారం అందగానే నారాయణగూడ పోలీస్ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు. లోపలికి వెళ్ళేసరికి ఇక మెడకు బిగించుకున్న చున్నీ ముడి  ఊడి పోయింది. కిందపడిపోయి యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: