నందమూరి బాలకృష్ణ ఎన్నో రకాల సరదా ప్రశ్నలు వేస్తూ.. కొన్ని వివాదాస్పద ప్రశ్నలను మోహన్ బాబుపై సంధించారు. దీంతో మోహన్ బాబుకు తిక్కరేగింది. అసలే మోహన్ బాబు.. తనను వివాదాస్పద ప్రశ్నలు అడిగితే ఊరుకుంటాడా.. తగ్గేదేలేదంటూ ఆయన కూడా బాలయ్యకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్న బాలయ్యను ఇరుకున పెట్టె ప్రశ్న.. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పగ్గాలు నువ్వెందుకు తీసుకోలేదు అని అనేసరికి బాలకృష్ణ అవాక్కయ్యారు. ఇక్కడితో ప్రోమోను కట్ చేశారు.. అయితే మోహన్ బాబు వేసిన ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఏం సమాధానం చెప్పి ఉంటారో అని అందరికీ కుతూహలంగా ఉంది.
మోహన్ బాబు వేసిన ఈ ప్రశ్నకు బాలకృష్ణ కచ్చితంగా క్లారిటీ ఇచ్చే ఉంటారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబే, తనకన్నా సమర్థుడని చెబుతారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమాధానంతో మోహన్ బాబు సైలెంట్ అయిపోయినా.. చంద్రబాబుకు ఈ క్లారిటీ కాస్తంత మైలేజ్ పెంచుతుందనే చెప్పాలి. ఇలా తనకు తెలియకుండానే చంద్రబాబుకు కలిసొచ్చేలా చేశారు మోహన్ బాబు. మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నా.. ఇటీవల ఎప్పుడూ రాజకీయాలపై మాట్లాడలేదు. కానీ ప్రస్తుతం బాలయ్య చేస్తున్నఈ టాక్ షోలో, ఇలా రాజకీయాల ప్రస్తావన తీసుకురావడం మాత్రం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు సినీ జనాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి