ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   ఏ నిర్ణయమైనా గవర్నర్ పేరు మీదే జరుగుతుందని.. పరిపాలనా అంతా గతంలోనూ.. ఇప్పుడు గవర్నర్ పేరు మీదే జరుగుతుంది.. ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయన్నారు.  అప్పులు తీసుకున్నా.. జీవోలు జారీ చేసినా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి.. ఇదేం కొత్త కాదే..? అని.. తన పేరు విషయంపై ఇష్యూ అయింది కాబట్టి.. గవర్నర్ అడిగి ఉంటారు.. దానికి సమాధానం చెబుతామనీ స్పష్టం చేశారు. కాగ్ కూడా ఆడిట్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటాయని.. రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్- ఎస్డీసీ అనేది అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత పథకాల కోసం ఏర్పాటు చేసిందని వెల్లడించారు.  ఎస్డీస ఏర్పాటుపై చట్టమే చేశాం.. అందులో అన్ని విషయాలు ఉన్నాయని.. ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి.. ఎక్కడా ఆగలేదు కదా..? అయితే కొన్ని రోజులు జాప్యం కావచ్చన్నారు. 

కోవిడ్ సమయంలో చాలా మంది పడుతోన్న ఇబ్బందులతో పోల్చుకుంటే జీతాల సమస్య అనేది పెద్ద సమస్యే కాదని.. జీతాలు కొన్ని రోజుల జాప్యం అయినా ఫర్వాలేదని చాలా మంది ఉద్యోగులు స్వయంగా నాతోనే చెబుతున్నారని పేర్కొన్నారు.  ఉద్యోగుల జీతాల విషయంలో కొందరు రాజకీయం చేస్తున్నారని.. కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ చెప్పారు. కోవిడ్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే సంక్షేమ పథకాల ద్వారా డబ్బును ఇచ్చాం. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల్ని సీఎం జగన్ నాకు అప్పగించారు..

ఆ మేరకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేపట్టామనీ తెలిపారు. పన్నుల వసూళ్లకు సంబంధించిన విషయంలో డీలర్ బేస్ గురించి సుదీర్ఘంగా చర్చించామన్నారు. జాతీయ స్థాయిలోనూ.. గతంలో ఏపీలోనూ ఆర్థిక శాఖకి అనుబంధంగానే వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలు ఉండేవని.. జీఎస్టీ విధానం అమల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  ఆర్దిక శాఖ వద్దే వాణిజ్య పన్నుల శాఖ ఉండాలని నారాయణ స్వామే నాతోనే అన్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: