
కాకినాడ ఎలక్షన్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నా మీద కన్నబాబు మీద ఊగి పోతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి నాయకులు కూడా ఆశ్చర్యపోతూ చూశారు. మీరు బాగుండి, నీ ప్రవర్తన మార్చుకుని, మీ హవా భావాలు బాగుంటే మేము మీ కంటే బాగుంటాం. మన 30 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు ప్రదర్శించ లేదని ఎమ్మెల్యే అన్నారు. మేం మాట్లాడానికి ప్రధాన కారణం మా నాయకుని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారు గత 15 రోజుల నుంచి తనకు ఇష్టం వచ్చినట్లుగా ఒక సైకో, నియంత, హిట్లర్ పరిపాలన అంటూ మాట్లాడితే ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఖండించారా అని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడిగారు.
మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నాను. వచ్చే ఎన్నికలకు కాకినాడ నుండి టిడిపిలో కొండబాబుకు టిక్కెట్టు లేదనీ చంద్రబాబు సిఎం అవ్వడం, కొండబాబుకు టిక్కెట్టు రావడం ఒక కలే అని కడిగిపారేశారు.