అయితే అటు పాకిస్థాన్ భారతదేశంపై ఎప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. భారత్ దగ్గర ఉన్నటువంటి యుద్ధవిమానాల కంటే తమ దగ్గర ఉన్న యుద్ధవిమానాలు ఎంతో శక్తివంతమైనవి అంటూ చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారత దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానం కంటే తమ దగ్గర ఉన్న ఎఫ్ 21 యుద్ధ విమానం ఎంతో అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంది అంటూ ఇటీవలే మరోసారి పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది.
అయితే ఇటీవల అంతర్జాతీయ నిపుణులు దీని పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ 16, ఎఫ్ 21 యుద్ధ విమానాలు భారతి దగ్గర ఉన్నటు వంటి రాఫెల్ యుద్ధ విమానాలు సామర్థ్యం తో సమతూగే పరిస్థితి లేదు అంటూ చెప్పు కొచ్చారు నిపుణులు. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ 21 యుద్ధ విమానాలు రాఫెల్ తో పోల్చి చూస్తే కేవలం సగం సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ చోట్ల ఈ రెండు రకాల యుద్ధ విమానాలను వాడిన సందర్భాలు పరిశీలించిన తర్వాత నిపుణులు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి