
అసలు జగన్ మెప్పు పొందడానికి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అలాగే మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారో కూడా తెలిసిందే. వైసీపీ కార్యకర్తలని తీసుకెళ్లి చంద్రబాబు ఇంటి దగ్గర హడావిడి చేయడం, అసెంబ్లీలో చంద్రబాబు, రఘురామ కృష్ణంరాజులపై బూతులు మాట్లాడటం...అబ్బో ఒకటి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే జనం ఆమోదిస్తారని అనుకున్నారో లేక మంత్రి పదవి కోసం చేశారో గానీ...మొన్నటివరకు బాగానే హడావిడి చేశారు.
కానీ కొంతకాలం నుంచి జోగి హడావిడి కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఆ హడావిడి తగ్గడానికి కూడా కారణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా సరే గడ్డు పరిస్తితులు ఎదురైతే ఏం అవుతుందో..ఇప్పుడు జోగి రమేష్ అలాంటి పరిస్తితిలోనే ఉన్నారు. ఇటీవల పెడనలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పెడన జెడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడింది. ఇక్కడ అనూహ్యంగా టీడీపీ గెలిచింది. ఈ ఓటమి జోగికి కాస్త డ్యామేజ్ చేసింది.
అటు తన సొంత నియోజకవర్గం మైలవరం పరిధిలోని కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలో కూడా వైసీపీ ఓడింది. జోగి సోదరుడు అక్కడ బాగానే హడావిడి చేశారు. కానీ ఆ మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. ఇలా రెండువైపులా జోగికి భారీగానే డ్యామేజ్ జరిగింది. ఆ ఎఫెక్ట్ మంత్రి పదవిపై పడింది. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందో రాదో డౌట్‌గా ఉంది.