కొన్ని దశాబ్దాల నుంచి శత్రుదేశాలుగా కొనసాగుతున్న పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఎప్పుడు తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంటుంది. ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఎప్పుడు భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తూ భారత్లో మారణహోమాలు సృష్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్మీకి ప్రభుత్వం ఎన్నో అధికారాలు ఇవ్వడంతో సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తోంది భారత ఆర్మీ. భారత్ లోకి అక్రమంగా చొరబడిన ఎంతో మంది ఉగ్రవాదులను గుర్తిస్తూ ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేసి మట్టు పెడుతుంది భారత ఆర్మీ.


 దీంతో ఉగ్రవాదులు భారత సరిహద్దు లోకి అడుగు పెట్టాలి అంటే ప్రస్తుతం భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే వివిధ ఆపరేషన్స్ నిర్వహించి నక్కి ఉన్న ఉగ్రవాదులను సైతం ఎన్కౌంటర్ చేస్తున్నారు ఆర్మీ. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఇప్పుడు సరిహద్దుల్లో సరికొత్త కుట్ర కు ప్లాన్ చేశారు అని అర్థమవుతుంది. ఇటీవలే సరిహద్దులో ఏకంగా 400 మంది తీవ్రవాదులను పాకిస్తాన్ మోహరించింది అన్న విషయం భారత ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. చలికాలంలో సైన్యం కాస్త అప్రమత్తంగా ఉండదు అని భావించిన పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదులను మొహరించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో భారత ఆర్మీలో టెక్నాలజీ పెరిగిపోవడంతో సాటిలైట్స్ సహాయంతో ఉగ్రవాదులు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు అన్న విషయాలను ఎంతో సులభంగా గుర్తించటం జరుగుతుంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో 400 మంది తీవ్రవాదులను పాకిస్థాన్ మోహరించినట్లు గుర్తించిన భారత్ ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. స్వయంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ నరవానే  హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ 400 మంది ఉగ్రవాదులు మోహరించింది అన్న విషయాన్ని చెప్పారు. ఇలా చెప్పడం వల్ల ఒక వైపు ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ గురించి చెప్పడమే కాదు..  పాకిస్థాన్ ప్లాన్ మాకు ముందే తెలుసు అని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: