వ్యాక్సిన్.. కరోనా వైరస్ కష్టకాలంలో ఇదొక్కటే మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వైరస్ పై పోరాటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరీ ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్న వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. అయితే మొదట్లో వ్యాక్సిన్ విషయంలో ఎంతో మంది అనుమానాలు అపోహలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో మంది స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతోంది. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో ఏకంగా 150 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంది భారత్. అయితేఇప్పటికే దాదాపుగా భారత్లో అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు. ఇలా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది భారత ప్రభుత్వం. ఇటీవల సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ నూ ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసు కూడా అవసరం అంటూ శాస్త్రవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్  లో కూడా బూస్టర్ డోస్ ఇస్తున్నారు.



 అయితే అటు ఆరోగ్య కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ అందించడంలో ఎంతగానో కీలక పాత్ర వహిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా వ్యాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు ఉండడం గమనార్హం. ఏకంగా నిమిషాల వ్యవధిలోనే రెండు రకాల వ్యాక్సిన్ లు ఇస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే తొమ్మిదవ తరగతి విద్యార్థికి అర గంట వ్యవధిలోనే రెండు కరోనా వ్యాక్సిన్ లు వేసిన ఘటన బెంగాల్ లోని ఖరగ్పూర్ సబ్ డివిజన్ లో వెలుగులోకి వచ్చింది..దేబ్రా లోని అలోక పాఠశాలలో చదువుతున్న సౌథితే అనే విద్యార్థి ఇటీవలే సోమవారం మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లకుండా గేటు వద్ద తిరుగుతూ కనిపించాడు. వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నాడు అని భావించిన సిబ్బంది మరోసారి టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాకైనా వైద్యులు వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: