చలి కాలం కావడం వలన ప్రజలు అందరూ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలో ఉండగా హఠాత్తుగా భూ ప్రకంపనలు రావడం అంతే కాకుండా పలు ప్రాంతాల్లో ఇల్లు కూడా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళల్లో నుండి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల తీవ్రతను నమోదు చేసే సాధనాన్ని 'సిస్మోగ్రాఫ్' అంటారు. కాగా ఈ సాధనాన్ని వినియోగించి ఈ భూ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. అయితే ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం సంబవించ లేదని అధికారులు చెప్పారు.
కాగా ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్లో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజుల్లో భూమి కన్పించడం ఇది మూడో సారి అని అక్కడి అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ రానున్న కొన్ని రోజుల వరకు ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక్కడకి ఇలా జరగడం మాములే అయినా కూడా నెగ్లెక్ట్ గా ఉండడం తగదు. ప్రభుత్వం కూడా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి