చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఉన్న అసమ్మతి అంతా ఇంతా కాదు. సొంత పార్టీలోనే అనేక సెగలు పుడుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ఎప్పుడు జరుగుతూనే ఉంది. అంతేకాదు ఒక కీలక మంత్రి మాత్రం ఏకంగా  రోజాకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారనే వాదన కూడా వైసీపీ పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కనుక తనకు టికెట్ ఇవ్వకపోతే..ఇక ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆమె ప్రజలకు బాగా చేరువ అవుతున్నారు. వారి సమస్యలు గురించి కూడా పరిష్కరిస్తున్నారు.

అలాగే మరోవైపు.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ కు కూడా టికెట్ దక్కే ఛాన్స్ లేదనే ప్రచారం జరుగుతోంది.ఆయన ప్రజలకు దగ్గర అవడం లేదని.. వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగిపోయారని సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ప్రచారం అనేది వస్తోంది. దీంతో మధు కూడా వచ్చే ఎన్నికల్లో కనుక తనకు టికెట్ కనుక ఇవ్వకపోతే.. సత్తా చూపించాలని అనుకుంటున్నారు. అయితే.. ఆయన మాత్రం ఇండిపెండెంట్గా కాకుండా.. ఒక కీలక పార్టీ తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నారట.

ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్న అన్నా రాంబాబుకు కూడా టికెట్ ఇవ్వొద్దని ఇంకా పార్టీలో ఇప్పటికే వందల మంది అభ్యర్థనలు చేశారని ప్రచారం అనేది జరుగుతోంది. ఆయన తమను పట్టించుకోవడం లేదని ఇక ప్రజలకు కూడా దగ్గర కావడం లేదని..అలాగే ఎన్నికలకు ముందు ఉన్న హవా ఇప్పుడు లేదని..అందుకే ఆయనకు టికెట్ ఇస్తే.. పార్టీ ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని .. పెద్ద ఎత్తున విమర్శలు అనేవి వస్తున్నాయి.దీంతో ఆయన కూడా ఎంతో ముందు జాగ్రత్త పడుతున్నారు. పార్టీ టికెట్ కనుక ఇవ్వకపోతే.. ఒంటరిగా అయినా సరే పోటీ చేసేందుకు తాను రెడీ అని వ్యతిరేకులకు ఆయన గట్టిగానే సంకేతాలు పంపుతున్నారు. మొత్తానికి వైసీపీ పార్టీలో చాలా మంది నేతలకు కూడా తమ తమ వ్యూహాలను రెండేళ్లకు ముందుగానే రెడీ చేసుకుంటుండడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: