వినటానికే అసలు నమ్మశక్యంగా లేదు. రేపే మాపో తెలుగుదేశంపార్టీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబునాయుడు బహిరంగంగానే లవ్ ప్రపోజల్ పంపారు. తమ రెండుపార్టీలు పొత్తులు పెట్టుకుంటాయన్న నమ్మకంతోనే రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలోనే మళ్ళీ పోటీచేస్తానని గెలుస్తానని లోకేష్ చాలెంజ్ చేశారు.
అయితే తాజాగా జరిగిన ఓ డెవలప్మెంట్ లోకేష్ కు ఏమాత్రం రుచించనిదే. అదేమిటంటే మంగళగిరి టీడీపీలోని సీనియర్ నేత మునగపాటి మారుతీరావు జనసేనలో చేరారు. అదికూడా పవన్ కల్యాణ్ సమక్షంలోనే మారుతి జనసేనలో చేరారు. ఇంకాకొంతమంది టీడీపీలో నుండి జనసేనలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజంగా లోకేష్ ను బాగా ఇబ్బందులు పెట్టేదే అనటంలో సందేహంలేదు.
అసలు టీడీపీలో నుండి నేతలను జనసేనలో చేర్చుకోవటంలో పవన్ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావటంలేదు. నిజంగానే చంద్రబాబు పంపిన ల్ ప్రపోజల్ కు సానుకూలంగా స్పందించే ఆలోచన ఉండుంటే టీడీపీ నేతలను జనసేనలో చేర్చుకునే ఆలోచనే పవన్ చేయరు. అయినా ఇపుడు చేర్చుకున్నారంటే ఏ విధంగా అర్ధంచేసుకోవాలో చంద్రబాబునాయుడు, లోకేష్ కు అర్ధం కావటంలేదు. టీడీపీ నేతలు ఇంకా కొంతమంది తొందరలోనే జనసేనలో చేరబోతున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి మంగళగిరి నుండి పోటీచేయాలని పవన్ కు చాలా బలమైన కోరికుంది.
అయితే వివిధ కారణాలతో మొన్నటి ఎన్నికల్లో భీమిలి, గాజువాక నుండి పోటీచేశారు. ఏరికోరి రెండు నియోజకవర్గాలను ఎంపికచేసుకుని పోటీచేసినా పవన్ ఓడిపోవటం ఆశ్చర్యమే. అసలు మంగళగిరిలో చేనేతలకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. ఎందుకంటే బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో పోటీచేసే ఉద్దేశ్యంతోనే. అయితే చివరి నిముషంలో ఏమైందో నియోజకవర్గాలను మార్చేశారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పవన్ మంగళగిరి నుండి పోటీ చేస్తారా అనే డౌటు పెరిగిపోతోంది. అదే నిజమైతే మరి లోకేష్ ఏమైపోతారబ్బా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి