
అక్కడ పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్...ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళడంతో మండపేట బాధ్యతలు తోటకు దక్కాయి..ఇక మండపేట బాధ్యతలు తీసుకున్నాక తోట దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు...అలాగే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మంచి విజయాలు అందేలా చేశారు. అలా చేయడంతో తోటకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఎమ్మెల్సీ పదవి దక్కాక మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
మండపేటలో టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా రాజకీయం చేశారు..అక్కడ బలంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుని నిలువరించడమే లక్ష్యంగా తోట ముందుకెళుతున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది...కానీ నెక్స్ట్ ఎన్నికల్లో తోటకు అసలు సీటు వస్తుందా? సీటు వస్తుందా? గెలుస్తారా? అనే డౌట్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తోట చూసుకుంటున్న మండపేట సీటు పిల్లి సుభాష్ది...మరి ఆయనకు నెక్స్ట్ సీటు ఇవ్వకుండా రాజ్యసభకే కంటిన్యూ చేస్తే పర్లేదు.అలా కాకుండా సుభాష్‌కు సీటు ఇస్తే తోట పరిస్తితి అంతే. అటు రామచంద్రాపురం సీటు దక్కే పరిస్తితి లేదు..అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు.
ఒకవేళ ఈ రెండు సీట్లలో ఒకటి దక్కిన...గెలవడం అనేది కష్టమయ్యేలా ఉంది..ఎందుకంటే నెక్స్ట్ టీడీపీ-జనసేనలు కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి తోటకు లక్ తక్కువ ఉంటుందనే చెప్పొచ్చు.