సిఎం జగన్ మోహన్ రెడ్డి తమకు దైవంతో సమానమని, పదవి ఉన్నా లేకున్నా ఆయన వెంటే ఉంటూ సైనికుడిలా ప్రజల కొరకు పనిచేయడమే తమకు అత్యంత గౌరవమని అన్నారు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ గారిని గెలిపించి తీరుతామని ప్రజల కోరిక కూడా అదేనని అన్నారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్నారు. మంత్రి కాకాణి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపలేదని తెలిపారు. అయినా ఆయనపై గౌరవం తగ్గదని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన అధినేతపై నిప్పులు చెరిగింది వైకాపా నేత అనిల్. రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కాదని టిడిపి నేతల దగ్గర బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టిడిపికి వంత పాడుతూ వారి దగ్గర సీట్లు అడుక్కునే ఇలాంటి వ్యక్తి నాయకుడే కాదని, అలాంటిది సీఎం ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. కాగా ఇపుడు ఈ వ్యాఖ్యలకు జనసేన అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి