అచ్చోసిన ఆంబోతులా పెరిగావు.. కానీ ఏ పని చేతకాదు.. ఇక ఇలాంటి తిట్లు పల్లెటూళ్లలో ఎక్కువగా వినిపిస్తుంటాయి.తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా పని చేయకపోతే ఇలాంటివి తిడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు ఎంతో మంది ఈ సామెతను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పని చేతగానివాడిని  ఎందుకు అచ్చోసిన ఆంబోతు అని తిడుతూ ఉంటారు.. ఎద్దులను ఉదాహరణగా చూపుతు ఎందుకు తిట్టరు అన్నది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎద్దు కి ఆంబోతు కి మధ్య తేడా ఏంటి అన్నది చాలా మందికి తెలియదు కూడా.


 సాధారణంగా ఒక ఆవుకు జన్మించినప్పుడు ఎద్దు, ఆంబోతు రెండూ కూడా కోడెదూడలే. కోడె దూడలు అంటే మగవాటిని అంటుంటారు. అయితే ఇలా చిన్నప్పుడు కూడా కోడె దూడలు గా పుట్టిన వాటిలో కొన్ని పెద్దయిన తర్వాత ఎద్దులుగా మారితే మరికొన్ని ఆంబోతులు అవుతూ  ఉంటాయి. వ్యవసాయంలో రైతుకు ఆసరాగా పొలం దున్నడానికి బండి నడపడానికి ఉపయోగపడుతూ ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవి ఎద్దులు. కానీ ఏ కష్టం చేయకుండా తిని తిరుగుతూ ఉండేవి ఆంబోతులు. అయితే ఎక్కువగా పల్లెటూర్లలో వివాహాలు ఇతర శుభకార్యాలు జరిగేటప్పుడు కోడెదూడ లకు శంఖచక్రాల ముద్ర వేసి వాటిని దేవుడి పేరుమీద వదిలేస్తూ ఉంటారు.


 దీంతో ఇక చిన్నప్పటినుంచి ఆ కోడెదూడకు ఆంబోతు గా పేరు ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఆ ఆంబోతు అల్లరిచేస్తూ ఉంది అంటే చాలు దానిపై పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు. ఎవరు కూడా ఆ ఆంబోతు ని కొట్టడానికి సాహసం చేయరు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆబోతు తినడానికి ప్రత్యేకంగా పొలం గట్టున పశుగ్రాసం కూడా పెడుతూ ఉంటారు. అంతేకాదండోయ్ ఆంబోతు ఎదురుగా వెళ్లడానికి కూడా ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే ఒకసారి ఆంబోతు రంకె వేస్తే ఎదురుగా ఎవరున్నా సరే ఆలోచించకుండా కుళ్ళపొడుస్తూ  ఉంటుంది. అందుకే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటారు. మరికొంతమంది ఆంబోతులను దైవ స్వరూపంగా భావించడం లాంటివి చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: