తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం తో ఇప్పటికే ఏపీ, తెలంగాణ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల లో కురిసిన వర్షాలకు జనం అనేక ఇబ్బందుల ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. కొన్ని ఎరియాల్లొ మాత్రం వేల ఎకరాల్లొ పంట నీట మునిగింది. హైదరాబాద్  లో నిన్న కురిసిన వర్షాలకు జనం ఇక్కట్లు పడుతున్నారు.. ఇకపోతే ఈ విషయం పై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.


మధ్యప్రదేశ్‌ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. దీంతో పాటు రుతుపవనాల ప్రభావం తో బుధవారం రాష్ట్రం లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి.


అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం లో 10 సెంటీమీటర్లు, జూలూరుపాడు లో 8.5, నిజమాబాద్ జిల్లాలో ని మంచిప్ప లో 6.6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.. హైదరాబాద్ లో నేరెడ్‌మెట్‌ లో 5.4, అల్వాల్‌ కొత్తబస్తీ 5.3, కంది 5, మహేశ్‌నగర్‌ లో 4.4 సెం.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. హైదరాబాద్‌ లో భారీ వర్షాల నేపథ్యం లో జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.. ప్రజలు మాత్రం ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: