వచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయమై బీజేపీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలేసి గజ్వేలు నియోజకవర్గంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో ఈటలకు దాదాపు 2 దశాబ్దాల అనుబంధముంది. అలాంటి నియోజకవర్గాన్ని వదిలేసి గజ్వేలులో పోటీచేయాలని నిర్ణయించుకోవటం వెనుక బలమైన కారణమే ఉందని స్వయంగా ఈటెలే చెప్పారు.

ఎంఎల్ఏ చెప్పిందేమంటే వచ్చే ఎన్నికల్లో కేసీయార్ ను ఓడిస్తే కానీ బుద్ధిరాదట. తనను మానసికంగా ఇబ్బందులు పెడుతున్న కేసీయార్ ను ఎలాగైనా ఓడించి తీరాల్సిందే అన్న ఆలోచనకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మద్దతుదారులు, ప్రజలు కూడా అర్ధం చేసుకున్నట్లు ఈటలే చెప్పారు. గజ్వేలులో పోటీచేసి కేసీయార్ ను ఓడించమని వాళ్ళే తనకు చెబుతున్నట్లు కూడా ఈటెల చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాను గజ్వేలులో పోటీచేయబోతున్నానంటే దానర్ధం హుజూరాబాద్ ను వదిలేసినట్లు కాదని కూడా సమర్ధించుకుంటున్నారు.

గజ్వేలులో కేసీయార్ ను ఓడిస్తే తెలంగాణాలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే పిచ్చిలాజిక్ వినిపించారు. ఈటెల చెప్పింది పిచ్చిలాజిక్ ఎలాగంటే టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్ధితుంటే కేసీయార్ ప్రతిపక్షంలో కూర్చునే అవకాశముంది. ఇదే సమయంలో కేసీయారే ఓడిపోవటం ఖాయమైతే టీఆర్ఎస్ గెలుపు అనుమానమే. అంతేకానీ టీఆర్ఎస్ ఓడినంతమాత్రాన కేసీయార్ కూడా గజ్వేలులో ఓడిపోతారని చెప్పేందుకు లేదు. దీనికి ఉదాహరణగా ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా కుప్పంలో చంద్రబాబునాయుడు గెలిచారు.


అదే రేపటి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబే ఓడిపోయే పరిస్ధితుంటే టీడీపీ రెండోసారి ఓటమి ఖాయమనే అనుకోవాలి. ఇదే పద్దతిలో వచ్చే ఎన్నికల్లో గజ్వేలులో కేసీయార్ గెలిచినా టీఆర్ఎస్ ఓడిపోవచ్చు. కేసీయార్ లేకపోతే టీఆర్ఎస్ దాదాపు లేదనేచెప్పాలి. పార్టీ మనుగడంతా కేసీయార్ పైనే ఆధారపడుంది. మరీ లాజిక్ ను ఈటల ఎలా మిస్సయ్యారో తెలీటంలేదు. నిజంగానే కేసీయార్+టీఆర్ఎస్ కూడా ఓడిపోయే పరిస్దితే ఉంటే ఈటెల హుజూరాబాద్ లోనే పోటీచేసినా టీఆర్ఎస్ ఓడిపోయి కేసీయార్ గెలిచినా చేయగలిగేదేమీ ఉండదు. నిజానికి కేసీయార్ గెలిచి టీఆర్ఎస్ ఓడిపోవాలనే ఈటెల కోరుకోవాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: