గుట్కా ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది తింటే క్యాన్సర్ చాలా ఫ్రీగా వస్తుంది. అయినా కానీ గుట్కాని ప్రభుత్వం బ్యాన్ చెయ్యడం లేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న గుట్కాతో పాటు ఇంపోర్టెడ్‌ సిగరెట్లను నెల్లూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పట్టుకోవడం జరిగింది.అయితే వీటి విలువ దాదాపు రూ.46 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఈబీ అధికారులు వారిని లోతుగా విచారిస్తున్నారు.ఇక కచ్చితమైన సమాచారం మేరకు.. కందుకూరు సబ్‌డివిజన్‌లోని గుడ్లూరులోని రెండు గోదాంలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.46 లక్షల విలువైన 128 బస్తాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, ప్యారిస్‌లో తయారైన వివిధ రకాల దిగుమతి చేసుకున్న 400 సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో తెట్టు గ్రామానికి చెందిన తిరుమలరాజు వెంకటేశ్వర్లు, కందుకూరు పట్టణానికి చెందిన బయ్య సుధాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కందుకూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌ఎస్‌ హుస్సేన్‌బాషా, ఎస్‌ఈబీ సిబ్బంది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జీ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం గుడ్లూరు మండలం తెట్టు, కందుకూరు రూరల్‌ మండలం ఓగూరులో ఉన్న రెండు గోదాంలపై దాడులు నిర్వహించినట్లు ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు.అసలు ఎలాంటి లైసెన్స్ లేకుండా పొగాకు ఉత్పత్తులు ఇంకా అలాగే సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించిన ఎస్‌ఈబీ బృందం వెంకటేశ్వర్లు, సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. గతంలో గుడ్లూరు పోలీస్ స్టేషన్‌లో వెంకటేశ్వర్లుపై సస్పెక్ట్ షీట్ తెరవగా, అతనిపై పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. సుధాకర్‌పై గతంలో సింగరాయకొండ, కందుకూరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 6 సీఓటీపీఏ కేసులు నమోదయ్యాయి. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ దాదాపు రూ.46 లక్షల వరకు ఉంటుందని, కర్ణాటకలోని తుంకూరు నుంచి తీసుకువచ్చి ఏపీలో అధిక ధరలకు గుట్కా విక్రయిస్తున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం ఇంకా రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: