ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చే మూడున్నరేళ్లు అయిపోయింది. అయితే మొన్ననే ఎన్నికలు జరిగినట్లు ఉంది పరిస్థితి. ఇక 2024 ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం తొమ్మిది నెలలు మాత్రమే ఉంది. ఈ మిగిలిన కొద్ది సమయాన్ని వైసీపీ సరిగా వాడుకుని ప్రజల్లోకి వెళితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. తాజాగా ఇదే విషయంపై జగన్ ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో మంచి పేరు లేని నేతలు అందరినీ గట్టిగా క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. ఎన్నికల భయం అప్పుడే జగన్ లో మొదలైంది. వాస్తవంగా అయితే అధికారంలో ఉన్న పార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే ఎంత పరువు తో కూడిన విషయమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గం విషయంలో జగన్ స్వయంగా పరిశీలించి తగు సూచనలు ఇస్తున్నాడు. జగన్ గత ఎన్నికల ముందు చెప్పిన హామీలలో అన్నింటినీ తీర్చలేకపోయాడు. అలా హామీలను ఇచ్చి ఫెయిల్ అయిన వాటిలో  పోలవరం ప్రాజెక్ట్, ఉద్దానంలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు, ప్రత్యేక హోదా, వైజాగ్ రైల్వే జోన్ లాంటివి ఉన్నాయి. అయితే ఈ హామీలలో ఎప్పటికీ తీర్చలేనిది ఏమైనా ఉంది అంటే ప్రత్యేక హోదా అనే చెప్పాలి.  ఇక మిగిలిన వాటిని ఎలాగోలా ఉన్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. మరి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తాడా లేదా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు కొత్త హామీలను వెతుక్కుంటాడా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

ఒకవైపు ఈ పనులు చేసుకుంటేనే మరోవైపు ప్రతిపక్షము నుండి ఎదురయ్యే విమర్శలను డిఫెండ్ చేసుకోవాలి. కాగా సర్వేలు ప్రకారం మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని అంటున్నాయి. కానీ ప్రజలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, వాస్తవంగా చూస్తే ప్రస్తుతం జగన్ పాలనపై ఆగ్రహంగానే ఉన్నారు. ఆఖర్లో అయినా కొన్ని అద్బుతమయిన నిర్ణయాలతో జగన్ ఆకట్టుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: