వైసీపీలో చేరబోతున్నారని ప్రచారంలో ఉన్న మాజీమంత్రి, టీడీపీ ఎంఎల్ఏ పోటీచేయబోయే నియోజకవర్గం కూడా ఫైనల్ అయిపోయిందని సమచారం. డిసెంబర్ 1వ తేదీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫంక్షన్లో గంటా తన భవిష్యత్ రాజకీయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం ఏమిటంటే డిసెంబర్లో గంటా వైసీపీలో చేరబోతున్నారట. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీచేయటం దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం గంటా విశాఖ నగరంలోని ఉత్తరం నియోజకవర్గం నుండి టీడీపీ ఎంఎల్ఏగా ఉన్నారు. ఎన్నికకు ఒక నియోజకవర్గం మార్చే అలవాటు గంటాకుంది. అలాగే అధికారపార్టీలో మాత్రమే ఉంటారనే నెగిటివ్ ప్రచారం కూడా గంటా విషయంలో జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే వైసీపీలో చేరాలంటే కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని వైసీపీలో కండీషన్ పెట్టారట. అందుకనే గడచిన మూడున్నరేళ్ళుగా పెద్దగా యాక్టివ్ గా లేరని తెలిసింది.

వచ్చేఎన్నికల్లో గంటా  వైజాగ్ ఎంపీగా పోటీచేస్తారని, ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణమూర్తి ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. గంటా ఖాళీచేయబోయే ఉత్తరం నియోజకవర్గం నుండే ఎంవీవీ పోటీచేస్తారేమో చూడాలి. ఏదేమైనా గంటా వైసీపీలో చేరితే టీడీపీ, జనసేనకు ఏకకాలంలో ఇబ్బందనే చెప్పాలి. ఎందుకంటే కాపుల్లో గంటాకు మంచి పట్టుంది. అలాగే వైజాగ్ జిల్లా వ్యాప్తంగా బలమైన మద్దతున్న నేత. గంటాకు వైజాగ్ లోనే కాకుండా రాయలసీమ, కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా మంచి పరిచయాలున్నాయి. కాబట్టి తన పరిచయాలను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుపుకోసం ఉపయోగిస్తుంటారు.

తన మద్దతుదారులందరినీ తీసుకుని వెళిపోవటం టీడీపీకి పెద్దదెబ్బగా అనుకోవాలి. ఇదే సందర్భంలో గంటా గనుక జనసేనలో చేరితే పార్టీకి మంచి బూస్ట్ వచ్చినట్లుండేది. కానీ అనేక సమీకరణలను లెక్కేసుకున్న గంటా వైసీపీలో చేరటానికి రెడీ అయిపోయారట. జగన్ కూడా కొన్ని కండీషన్లు పెట్టి గంటాను చేర్చుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో మరింత క్లారిటి రావాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: