ఐసీఐసీఐ బ్యాంకు ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు వరుస   గుడ్ న్యూస్ లను చెప్పింది..ఇప్పటి కీ కొన్ని వార్తలు నమ్మ లేకున్నా సరే నిజంగా ఉన్నాయా అనే సందేహం రావొచ్చు.. కానీ ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకోనేవారికి ఇది చక్కటి శుభ వార్తను చెప్పింది.బ్యాంకు సిబ్బంది అడిగే బోలెడు డాక్యుమెంట్లతో రోజూ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు పర్సనల్‌ లోన్లు వంటివి ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే మంజూరవుతున్నాయి. తాజాగా హోమ్‌ లోన్‌ల ప్రక్రియను కూడా సులభతం చేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త డిజిటల్ లెండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ iLens లాంచ్‌ చేసింది. ఈ తరహా సేవలు మొదటిసారి డిజిటల్‌ విధానంలో అందిస్తున్నట్లు తెలిపింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా రుణం తీసుకునే వారికి ప్రాసెస్‌ తేలిక కానుందని తెలిపింది..


ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోవాలని అనుకునేవారు నేరుగా దీని నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాసెస్‌తోపాటుగా క్రెడిట్‌ డిస్బర్స్‌మెంట్‌ వరకు మొత్తం రుణ ప్రక్రియ డిజిటల్‌గానే అయిపోతుంది. ప్రస్తుతం కేవలం ఇంటి రుణాల సేవలను మాత్రమే దీని ద్వారా అందించనున్నట్లు tcs ఒక ప్రకటనలో తెలిపింది. పేపర్‌లెస్ లాగిన్, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌, ప్రాపర్టీ పరిశీలన, ఇన్‌స్టెంట్‌ సాంక్షన్, లోన్‌ డిస్బర్స్‌మెంట్‌లు తక్కువ సమయంలోనే జరుగుతాయని పేర్కొంది..


ఇకపోతే లోన్‌ మంజూరు చేయడంలో పని చేసే బ్యాంకు ఉద్యోగులు , సోర్సింగ్ ఛానెల్‌లు, లాయర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, అండర్‌రైటర్లు వంటి వారందరికీ ఇది ఒకటే ఏకీకృత డిజిటల్ ఇంటర్‌ఫేస్‌గా ఉంటుంది.మొదట వీడియో KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్‌ చేసే వివరాల ఆధారంగా లోన్‌ ఇచ్చే ముందు సంబంధిత వ్యక్తి క్రెడిట్ అసెస్‌మెంట్‌ కూడా చేస్తుంది. దీని ద్వారా లోన్‌ అప్లికేషన్‌ లైవ్‌ స్టేటస్‌ చూసుకోవచ్చు..ఇది చాలా సులభమైన మార్గం కాబట్టి మంచి ఆదరణ పొందుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: