సాధారణంగా స్మశాన వాటిక అంటే చాలు అటువైపు వెళ్లడానికి ఎంతో మంది భయపడుతూ ఉంటారు. కొంతమంది దయ్యాలు భూతాలు ఉన్నాయని భావిస్తూ ఉంటే ఇంకొంత మంది మాత్రం స్మశాన వాటిక వైపు వెళ్తే మాత్రం కీడు జరుగుతుందని అంటూ ఉంటారు. కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప మిగతా వేళల్లో మాత్రం అటు స్మశాన వాటిక వైపు కన్నెత్తి కూడా చూడరు ఎవరు. ఇలా చూడ్డానికి కూడా ఇష్టపడరు అని చెప్పాలి.  కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏకంగా స్మశాన వాటిక లోనే కూర్చుని తినడం మొదలుపెట్టారు.


 అంతేకాదు తమకు ఇష్టమైన ఆహారాలు అన్నింటినీ కూడా ఇలా ఏకంగా స్మశాన వాటికలో ఉన్న సమాధుల పక్కనే కూర్చుని హాయిగా ఆరగిస్తూ ఉన్నారు. స్నేహితులతో తరచూ ఇలా స్మశాన వాటికకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదేమిటి స్మశాన వాటికలో ఎంజాయ్ చేయడమేంటి అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏకంగా స్మశాన వాటికలోనే రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ లో ఉండే లక్కీ రెస్టారెంట్ కు ఒక స్పెషాలిటీ ఉంది.


 ఈ రెస్టారెంట్ సమాధుల మధ్య ఉంటుంది అని చెప్పాలి.1950లో మహమ్మద్ అనే వ్యక్తి అక్కడ స్మశాన వాటిక బయట రెస్టారెంట్ పెట్టాడు. అయితే ఇప్పుడు అది అభివృద్ధి చెంది ప్రస్తుతం స్మశాన వాటికలోకి విస్తరించింది అని చెప్పాలి. దాదాపు ఆ స్మశాన వాటికలో 26 సమాధులు ఉన్నాయి. ఇక ఇలా సమాధులు ఉన్న స్థలాన్ని గ్రిల్స్ తో చుట్టూ కంచలాగా వేశారు.  ఇక పక్కనే టేబుల్స్ వేశారు.  అక్కడికి వచ్చే కస్టమర్లు ఆ టేబుల్స్ పై కూర్చుని స్పెషల్ టీని రుచి చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా స్మశాన వాటికలో ఏకంగా రెస్టారెంట్ ఉండడం కూడా అక్కడ బిజినెస్ బాగా పెరిగి పోవడానికి కారణమైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: