ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు చివరకు అమరావతి ఉద్యమానికి కూడా వెన్నుపోటు పొడిచినట్లే ఉన్నారు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రంలో ఆపేసి ఢిల్లీకి తీసుకెళ్ళింది జేఏసీ. 17,18,19 తేదీల్లో అమరావతి డిమాండ్ కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేసేందుకు బెజవాడనుండి 1500 మంది ఢిల్లీకి బయలుదేరారు. వీళ్ళు బయలుదేరిన రైలుకు విజయవాడలో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు జెండా ఊపితే వామపక్షాల నేతలు హడావుడి చేశారు.





అయితే మొదటినుండి ఆందోళనలను స్పాన్సర్ చేస్తున్న చంద్రబాబునాయుడు కానీ లేదా తమ్ముళ్ళు కానీ ఎక్కడా కనబడలేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అమరావతి ఉద్యమం జరుగుతోందని ఇంతకాలం ఒకటే ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ప్రత్యేక రైలు బయలుదేరే కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో అర్ధంకావటంలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు ఉపయోగపడుతుందని అనుకుంటేనే చంద్రబాబు ఏ విషయాన్ని అయినా టేకప్ చేస్తారు.





అవసరం తీరిపోయిందని అనుకున్నా, భవిష్యత్తులో ఉపయోగపడదని అనుకున్నా వెంటనే పక్కకు తోసేయటం చంద్రబాబు నైజం. చంద్రబాబు దృష్టిలో  ఇష్యు అయినా ఒకటే నేతలైనా ఒకటే. అమరావతిని మాత్రమే పట్టుకుని ఊగుతుంటే మిగిలిన ప్రాంతాల్లో సమస్యలు ఎదురయ్యేట్లున్నాయని చంద్రబాబుకు అర్ధమైంది. అందుకనే చాలాకాలంగా అమరావతి అంశంతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పాదయాత్ర అనుమతి విషయంలో కోర్టు ఆంక్షలను విధించినా, జేఏసీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపినా చంద్రబాబు నోరిప్పకుండా మౌనంగా ఉన్నది ఇందుకనే.





అంటే ఒకరకంగా అప్పట్లోనే అమరావతిని పక్కనపెట్టేసినట్లే అనే ప్రచారం జరిగింది. తాజాగా బెజవాడ-ఢిల్లీ రైలుప్రయాణం విషయంలో ఈ విషయమే స్పష్టంగా బయటపడింది. మామూలుగా అయితే చంద్రబాబు లేదా తమ్ముళ్ళు వేసే పులివేషాలు ఒక రేంజులో ఉంటాయి. అలాంటిది ఇపుడు అమరావతికి చంద్రబాబు అండ్ కో దూరంగా ఉంటున్నారంటే మూడు రాజధానుల ఏర్పాటు తప్పదని లేదా అడ్డుకునే అవకాశం లేదని వీళ్ళకి అర్ధమైపోయుండాలి. అందుకనే అమరావతి అంశంతో అసలు తమకు సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడటానికి కూడా ఇష్టపడటంలేదు. చంద్రబాబును నమ్ముకుంటే ఏ విషయమైనా ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపణైంది.




మరింత సమాచారం తెలుసుకోండి: