
ఆళ్లగడ్డ లో ఇద్దరు పని చేయండి టికెట్ విషయం తర్వాత చూస్తానని చంద్రబాబు చెప్పారు. మంత్రిగా చేశాను. వైసీపీ నుంచి వచ్చి మరీ పార్టీలో చేరాను టికెట్ నాకే ఇవ్వాలని అన్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ సాధించినా అఖిలప్రియ ఓడిపోయారు. అఖిలప్రియ ఫ్యామిలీకి పాపులారిటీ తగ్గిపోయింది. ప్రజల్లో ఆదరణ లేదు. టికెట్ నాకే ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరుతున్నారు. చివరకి ఇద్దరు ప్రజల్లోనే కొట్టుకునే వరకు వెళ్లారు.
లోకేశ్ పాదయాత్ర సందర్భంగా సుబ్బారెడ్డిని, భూమ అఖిల ప్రియ వర్గీయులు కొట్టారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. అఖిలప్రియ తనపై హత్యాయత్నం చేసిందని సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిలప్రియ తన చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై కేసు పెట్టారు. ఇలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. వీడియోలో మాత్రం భూమ అఖిలప్రియ వర్గీయులు సుబ్బారెడ్డిపై దాడికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అఖిలప్రియ కూడా మీద మీదకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సుబ్బారెడ్డి వర్గీయులు డిఫెండ్ చేసుకున్నారు.
దాడి చేసి మరీ సుబ్బారెడ్డిపై అత్యాచార కేసు పెట్టడం ఆమెకే చెల్లిందని పలువురు ఆరోపిస్తున్నారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఫ్యాక్షనిస్టు తీరుకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ అఖిలప్రియ అలాంటి కార్యక్రమాలకు జీవం పోస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పిల్లలను ఎత్తుకుని పోలీస్ స్టేషన్ లో సింపథీ పొందడానికే అఖిల ప్రియ వచ్చారని రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆళ్లగడ్డ రాజకీయం ఎటు వైపు దారి తీస్తుంది. ఎవరికీ టికెట్ దక్కుతుందో చూడాలి.