తాజా పరిణామాలు చూస్తుంటే ఎందుకో అనుమానంగానే ఉంది. టీడీపీ తరపున నెల్లూరు సిటి నియోజకవర్గంలో మాజీమంత్రి పొంగూరు నారాయణ పోటీచేయటం, గెలవటం మాట పక్కనపెట్టేస్తే అసలు పోటీచేసే అవకాశం దొరుకుతుందో లేదో అనుమానంగానే ఉంది. ఎందుకంటే మాజీమంత్రి మీద ఉన్న కేసుల కారణంగా పోటీపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈయన మీద చాలా కేసులు నమోదయ్యున్నాయి. 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులు, అమరావతి రాజధానిలో భూకుంభకోణం కేసు కూడా ఉంది.





పరీక్షల పత్రాల లీకేజి కేసులో అరెస్టయి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. భూకుంభకోణం కేసులో నారాయణ, చంద్రబాబునాయుడు మీద జాయింటుగా సీఐడీ కేసులు నమోదుచేసింది. ఇప్పటికే నారాయణకు చెందిన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసేసింది. వీటి జప్తుకు ఏసీబీ కోర్టు అనుమతి కూడా ఇచ్చేసింది. జప్తు ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే భూకుంభకోణంలోనే అసైన్డ్ భూముల కుంభకోణం ఉపకథలాంటిది.





అంటే భూసమీకరణలో జరిగిన కుంభకోణం ఒకఎత్తయితే ఎస్సీలకు కేటాయించిన భూములను మింగేయటం మరో కుంభకోణమన్నమాట. ఇందులో కూడా నారాయణ భారీఎత్తున భూములు లాగేసుకున్నారన్నది సీఐడీ ఆరోపణలు. ఆరోపణలుకావు నిజాలే అంటు ఎవరెవరి పేర్లతో నారాయణ భూములు కొన్నది, రిజిస్టర్ చేయించారనే వివరాలను కూడా సీఐడీ సంపాదించిందట. అంటే వీటిల్లో ఏదో ఒక కుంభకోణంలో నారాయణ గట్టిగా ఇరుక్కోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ కుంభకోణానికి పాల్పడినట్లు సీఐడి అందించిన సాక్ష్యాధారాలతో ఏసీబీ కోర్టు జడ్జి కన్వీన్సయ్యారట. అందుకనే లింగమని వాదనలను జడ్జి కొట్టిపారేశారు. 





ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈలోగానే 10వ తరగతి పరీక్షా పత్రాల లీకేజి కేసు, భూకుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో ఆధారాలు సేకరించి కోర్టు ద్వారా శిక్షపడేట్లుగా చూడాలని సీఐడీ పట్టుదలగా ఉంది. నిజానికి ఇవే కేసుల్లో చంద్రబాబు ఎంతవరకు ఇరుక్కుంటారన్నది తెలీటంలేదు.  మొత్తం వ్యవహారాలను నడిపించింది చంద్రబాబే అయినా తెరముందు అందరికీ కనిపించింది మాత్రం నారాయణే. కాబట్టి ముందు ఇరుక్కునేది నారాయణే. అరెస్టయిన తర్వాత విచారణలో నారాయణ గనుక నోరిప్పితే అప్పుడు చంద్రబాబు విషయం బయటపడుతుంది. కాబట్టి నారాయణ పోటీచేసే విషయం అనుమానంగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: