
మాజీమంత్రి భూమా అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్లే ఉన్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే టీడీపీని వదిలేయాలని. టీడీపీలో ప్రస్తుతం అఖిల ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. అయితే అది పేరుకుమాత్రమే. ఎందుకంటే అఖిలను చంద్రబాబునాయుడు, లోకేష్ మొదలు పార్టీలో ఎవరూ పట్టించుకోవటంలేదు. ఏ కార్యక్రమానికి, సమావేశాలకు కూడా పిలవటంలేదు. అఖిల నంద్యాలలోని పార్టీ ఆఫీసుకు వస్తే ఆమెతో ఎవరూ మాట్లాడటం కూడా లేదు.
సో పార్టీలో తన పరిస్ధితి ఏమిటో ఆమెకు బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ తో భేటీ అయినట్లు సమాచారం. యాదవ్ ఆధ్వర్యంలో ఈమధ్య ప్రాంతీయపార్టీ ఏర్పాటైంది. గుంటూరు జిల్లాలోని అమరావతిలో పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. అయితే ఆ తర్వాత పార్టీ పరిస్ధితి ఏమిటన్నది ఎవరకీ తెలీదు. రాబోయే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయబోతున్నట్లు ఆరోజు ప్రకటించిందే.
మరి వీళ్ళిద్దరు ఎలా కాంటాక్టులోకి వెళ్ళారో తెలీదు కానీ ఇద్దరి మధ్య భేటీ అయితే జరిగింది. ఇపుడు పరిస్ధితి ఏమిటే యాదవ్ తన పార్టీకి గట్టి అభ్యర్ధులు కావాలి. ఇదే సమయంలో అఖిలకు తాను చెప్పినట్లు వినే పార్టీ అధినేత కావాలి. సో పరస్సర అవసరమే ఇద్దరినీ కలిపినట్లుంది. యాదవ్ భేటీ సందర్భంగా కొన్ని డిమాండ్లను ఉంచారట మాజీమంత్రి. అవేమిటంటే జిల్లా మొత్తం టికెట్లు తాను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని, ఆళ్ళగడ్డలో తాను పోటీచేయబోతున్నట్లు చెప్పారట. అందుకు అవసరమైన మొత్తం ఖర్చును పార్టీయే పెట్టుకోవాలని షరతు విధించారట.
మరి అఖిల షరతులకు యాదవ్ ఏ విధంగా స్పందించారన్న విషయంలో క్లారిటి లేదు. తన షరతులకు అంగీకరిస్తే కనీసం నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను గెలిపించుకుని వచ్చే బాధ్యత తాను తీసుకుంటానని యాదవ్ కు అఖిల భరోసా ఇచ్చారట. మరి అఖిల చెప్పింది యాదవ్ ఎంతవరకు నమ్ముతారు ? యాదవ్ పార్టీని చూసి ఓట్లేసే జనాలు ఎవరు ? గెలిచేవారెవరు అన్నది సస్సెన్సుగా మారింది.