కూతురును దెబ్బకొట్టినట్లుగానే కామారెడ్డిలో కేసీయార్ ను కూడా దెబ్బకొట్టేందుకు జనాలు రెడీ అవుతున్నారు. కేసీయార్ ప్రభుత్వంపైన మండిపోయిన నియోజకవర్గంలోని  రైతులు  2018 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటుకు పోటీచేశారు. 100 మంది రైతులు పోటీచేయటంతో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది. అలాగే ప్రభుత్వం మీద మండిపోతున్న రైతులు, వాళ్ళు కుటుంబాలంతో ఎంపీగా పోటీచేసిన కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ఫలితంగా ఎంపీగా కవిత ఓడిపోయింది.





సేమ్ టు సేమ్ అన్నట్లుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో పోటీచేయబోతున్న కేసీయార్ ను ఓడించేందుకు గల్ప్ దేశాల బాధితులు రెడీ అవుతున్నారు. విషయం ఏమిటంటే తెలంగాణా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న జనాలు లక్షల్లో ఉన్నారు. వీళ్ళల్లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో సుమారు 35 వేలమంది ఉన్నారట. తమ సమస్యలను పరిష్కారించమని బాధితులు ఎన్నిసార్లు మొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదని బాధితులు, వాళ్ళ కుటుంబాలు మండిపోతున్నారు.





అందుకనే కామారెడ్డిలో పోటీచేయబోతున్న కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీచేసి ఓడిగొట్టి బుద్ధిచెప్పాలని గల్ఫ్ దేశాల బాధితుల సంఘం నిర్ణయించింది. నియోజకవర్గానికి చెందిన సుమారు 30 వేలమంది ఎడారిదేశంలో నానా అవస్తలు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళల్లో అత్యధికులు ఏజెంట్లు, బ్రోకర్ల మోసాలకు గురవుతున్న వాళ్ళే. బ్రోకర్లు, ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నదే కానీ ఎవ్వరిపైనా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని గల్ఫ్ బాధితుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.





అందుకనే గల్ఫ్ దేశాల బాధితుల ఇళ్ళల్లోని మహిళలను పోటీచేయించాలని జేఏసీ డిసైడ్ చేసింది. తెలంగాణా ఏర్పడిన దగ్గర నుండి సుమారు 1800 మంది గల్ఫ్ లోనే  చనిపోయారట. సుమారు 100 మందినైనా పోటీలోకి దింపాలని ఇప్పటికే డిసైడ్ అయ్యింది జేఏసీ. నిజామాబాద్ లో కూడా కవితకు వ్యతిరేకంగా 100 మంది రైతులు  పోటీచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. గల్ఫ్ బాధితుల సహాయనిధిని ఏర్పాటుచేస్తామని చెప్పిన కేసీయార్ మాట తప్పారని కాబట్టి తగిన బుద్ధి చెబుతామని జేఏసీ నేతలంటున్నారు. చూడబోతే కేసీయార్ కు ఇబ్బందులు తప్పేట్లులేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: