ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడిగా కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేవు అంటూ తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ అరెస్టు పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.ఈ క్రమంలోనే వారికి అదే స్టైల్ లోనే వైసిపి నేతలు సమాధానం చెబుతున్నారు.ఈ క్రమంలోనే కొడాలి నాని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ బిక్ష పెడితే విశ్వాసం లేదని విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు కాదు విశ్వాసం లేని కుక్కను నేను కాదు చంద్రబాబు నాయుడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తరువాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారు. వారికి విశ్వాసం లేదు అంటూ ఫైర్ అయ్యారు.   నాకు రాజకీయ బిక్ష పెట్టింది హరికృష్ణ  గారు నాకు తెలుగుదేశం పార్టీలో సీటు ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ నేను ఎవరికైనా విశ్వాసంగా ఉండాల్సి వస్తే అది పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ హరికృష్ణ గారికి ఉంటాను కానీ చంద్రబాబు నాయుడుకి ఉండాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు నాయుడు వేరే పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు.

నాకు ఇలాంటి జీవితం ఇచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఎలాగైనా తిట్టని నేను పడతాను, కానీ ఆయనను నోరెత్తి ఒక్క మాట అనను నన్ను తిట్టే హక్కు ఎన్టీఆర్ కి ఉంది. నన్ను చంపిన కూడా నేను మాట మాట్లాడను వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు వస్తే నా ప్రాణమైన తీసుకుంటాను కానీ ఎన్టీఆర్ ని ఒక్క మాట కూడా అనను అంటూ ఈ సందర్భంగా కొడాలి నాని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కూడా నేను ఎవరికోసమైనా చావాల్సి వస్తే మొదటి స్థానంలో కొడాలి నాని ఉంటారంటూ గతంలో కొడాలి నానితో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: