దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మ్రోగింది..అన్నీ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎన్నికల హడావుడి మొదలైంది.. ప్రధాన రాజకీయా పార్టీలు అన్నీ ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ..అయితే అవే సార్వత్రిక ఎన్నికలు కుటుంబాల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి.. సహజంగా రాజకీయాలు అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది.. ఒకరు ఈ పార్టీ కి అనుకూలంగా ఉంటే ఇంకొకరు వేరే పార్టీకి అనుకూలంగా వుంటారు. ఇలా ఒకే కుటుంబంలో వుండే వాళ్లలోనే భిన్న అభిప్రాయాలు కలిగి వుంటారు..దీనితో వారి మధ్య వారికే గొడవలు రావొచ్చు.. ఒక్కోసారి ఆ గొడవలు తీవ్ర స్థాయికి కూడా చేరుతూ ఉండటం మనం చూస్తూనే వున్నాం..అయితే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో చోటుచేసుకుంది.. దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాయి... ఒకే ఇంట్లో వుండే భార్యభర్తలు వేరువేరు పార్టీల తరుపున ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం అయ్యే వరకు నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను.. లేదంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండు. ఇద్దరం ఒకే చోట ఉండటం కుదరదు' అంటూ బీఎస్‌పీ నేత, మాజీ ఎంపీ కంకర్ ముంజరే తన భార్య, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అనుభా ముంజరేను కోరారు. దీంతో అనుభా ముంజరే పరిస్థితి ఆగమ్యగోచరంగా వుంది.మాజీ ఎంపీ కంకర్ ముంజరే బీఎస్పీ నుంచి టికెట్ సాధించి లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చున్నారు.. అతని భార్య అనుభా ముంజరే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సామ్రాట్ సరస్వర్ కోసం ప్రచారం సాగిస్తున్నారు. అనుభ ముంజరే మరియు కంకర్ ముంజరేలు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడం వారికి కాస్త సమస్యగా మారింది. 

మరోవైపు అనుభ ముంజరే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న తన భర్త కంకర్ ముంజరేకు ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా..అంటూ పలువురు మరో సమస్యను తెరపైకి తెస్తున్నారు.ఈ నేపధ్యంలో భర్త కంకర్ ముంజరే తన భార్యతో 'ఏప్రిల్ 19వ తేదీన ఇక్కడ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు ఇంటికి దూరంగా ఉండు మీ సోదరి ఇంటికి లేదా వేరే ఎక్కిడికైనా వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం సాగించు అని తెలిపారు.ఈ ఇంటిలో ఉంటూ కాంగ్రెస్‌కు అస్సలు ప్రచారం చేయవద్దు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లకపోతే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఎన్నికలకు ప్రచారం చేసుకుంటాను అని తేల్చి చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: