నందమూరి తారక రత్న భార్య.. అలేఖ్య రెడ్డి అందరికీ సుపరిచితమే.. తారకరత్న మరణం తర్వాత ఈమె పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. సినిమా హీరోగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తారకరత్న రాజకీయాలలోకి రాణిస్తారు అనుకున్న సమయంలో అనుకోకుండా మృతి చెందడం అభిమానులు,  కుటుంబ సభ్యులు ఈ విషయం జీర్ణించుకోలేకపోయారు.నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మొదటి రోజు తారకరత్నకు గుండెపోటు రావడంతో ఎవరూ ఊహించని విధంగా కొద్ది రోజులకే మరణించారు.


అయితే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుల అన్న సంగతి కూడా తెలిసిందే . తారకరత్న మరణించిన సమయంలో వారి కుటుంబానికి విజయ సాయి రెడ్డి అండగా ఉన్నారు.. ఈ ఘటన తర్వాత తారకరత్న కుటుంబానికి ఎన్నో విధాలుగా విజయసాయిరెడ్డి సహాయం చేశారట.  తాజాగా విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి పలు విషయాలను వెల్లడిస్తూ instagram స్టోరీస్ లో వెల్లడించింది.


మా జీవితంలో నాన్న లాంటి గొప్ప వ్యక్తి విజయ్ సాయి రెడ్డి అంకుల్.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఉంటాయని అలేఖ్య రెడ్డి వెల్లడించింది."మా కష్టసుఖాలలో మాతోనే ఉంటూ మా అందరిని ధైర్యంగా ముందుకు నడిపించిన వ్యక్తి విజయ్ సాయి రెడ్డి "అంటూ అలేఖ్య రెడ్డి తెలియజేసింది.. ఎన్నికల సమయంలో కూడా బిజీగా ఉండి.. తమకోసం విజయసాయిరెడ్డి స్పెషల్ గా రావడం చాలా ఆనందంగా అనిపించింది అంటూ ఆమె తెలియజేసింది.. ఎలక్షన్స్  సమయంలో మాతో ఉంటే.. ఆ విలువ ఏంటో ఆయనకు బాగా తెలుసు అని రాసుకొచ్చింది.. ఉగాది పండుగను కూడా అలేఖ్య రెడ్డి ఇంట్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ అలేఖ్య రెడ్డి ఇలా పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టు సైతం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: