పెద్ద‌ప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌ప్ప‌దా అంటే అవున‌నే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ పార్టీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ వెంకటేశ్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అనే ఊహ గానాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. వెంక‌టేష్ నేత గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఎంపీ టికెట్ రావ‌డంతో పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ వెంక‌టేష్ నేత‌కు ప‌క్క‌న పెట్టింది. 

ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వ‌ర్ కు పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తి చెందిన వెంక‌టేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్క‌డ కూడా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. చెన్నూరు ఎమ్మెల్యే వినోద్ కుమార్ కుమారుడు వంశీకి కాంగ్రెస్ అధిష్టాణం టికెట్ కేటాయించింది. టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై గుర్రుగా ఉన్న వెంకటేశ్ నేత బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

అందుకోసం తన ప్రయ త్నాలు ముమ్మరం చేసిన వెంకటేశ్ నేత ఏ క్షణం అయినా బీజేపీ కండువా కప్పుకోవచ్చనే చర్చ జోరం దుకుంది. బీజేపీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ప్రకటిం చడంతో ఆ పార్టీ నేతలు తనను బుజ్జగించి వెంకటేశ్ నేతకు బీజేపీ కండువా కప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వెంకటేశ్ నేత రంగ ప్రవే శంతో పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్‌లో రాజకీయ సమీకరణాలు మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా వెంక‌టేష్ నేత పార్టీకి గుడ్ బై చెబితే నేత‌కాని ఓట్ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు బీజేపీ వెంక‌టేష్ నేత‌ను బ‌రిలో దింపితే నేత‌కాని సామాజిక వ‌ర్గ ఓట్ల‌తో గెలిచే అవ‌కావాలు ఉన్న‌ట్టు ఆలోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: