ఏపీ రాష్ట్రవ్యాప్తంగా  వైసిపి హవా కొనసాగుతున్నా కానీ నగరి నియోజకవర్గంలో మాత్రం  జోరు తగ్గిందని చెప్పవచ్చు. మంత్రి రోజాకు  మొదటినుంచి  వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. ఈ వ్యతిరేకత అనేది  ప్రతిపక్ష టిడిపి నుంచి కాదు, సొంత పార్టీ అయిన వైసీపీ నేతలే ఆమెను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని వారు ముందుగానే జగన్  కు కూడా చెప్పారు. కానీ జగన్ ధైర్యం చేసి ఆమెకే సీటు కట్టబెట్టారు. అలాంటి రోజా ఈ ఎన్నికల్లో నగరిలో వికసించేలా కనబడడం లేదు. దానికి కారణాలు ఏంటో చూద్దామా.. నగరి నియోజకవర్గంలో ప్రతి  సారీ ఎన్నికల్లో రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఇక్కడ చివరి రౌండు లెక్కింపు వరకు అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం. 

కానీ ఈ ఎన్నికల్లో చాలా భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు గెలిచినటువంటి రోజా కు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భాను ప్రకాష్ ఆమెకి గట్టి పోటీ ఇస్తున్నారు.  ఈసారి అక్కడ రోజా హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచన బోల్తా పడ్డట్టు ఉంది.  సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  దీనికి ప్రధాన కారణం ఆమె అవినీతిలో ముఖ్యపాత్ర పోషించడం.  రోజా సోదరులు, భర్త సెల్వమణి  ఆగడాలు ఆ నియోజకవర్గంలో పెరిగిపోయాయి.  అక్కడ వైసిపి నాయకులపై డామినేట్ చేయడం మొదటి నుంచి జరుగుతూనే ఉంది.

దీంతో ఎన్నిసార్లు రోజాకు చెప్పినా  పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో విసిగిపోయిన  వైసీపీ నాయకులు  డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికే చెప్పి ఆమెకు టికెట్ ఇవ్వొద్దన్నారట. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక్క అడుగు ముందుకేసి మళ్ళీ ఆమెకే టికెట్ కట్టబెట్టారు. దీంతో లోకల్ వైసిపి నాయకులు రోజాకు ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదట. ఈ క్రమంలోనే అక్కడ టిడిపి నుంచి పోటీ చేస్తున్నటువంటి గాలి భాను ప్రకాష్  విజయం సాధిస్తారని చర్చ జరుగుతోంది. ఈ  విషయం రోజాకు అర్థం అయినట్టుంది. ఈరోజు ఓటు వేసి బయటకు  వచ్చినప్పుడు కూడా ఆమె మొహంలో ఏమాత్రం నవ్వు కనిపించడం లేదు. దీంతో నగరిలో  రోజా వికసించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: