గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవ లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా విజయం సాధించేలాగే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక ఈ ఎన్నికల్లో పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోయారు. అయితే టిడిపి బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు అన్న విషయం తెలిసిందే.



 ఇలా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలు కూడా ఇచ్చారు పవన్. తనను గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ప్రజల గొంతుకగా మారి ప్రజ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలా ప్రచారంలో దూసుకుపోయి గెలుపు పై ధీమాతో ఉన్న పవన్ కళ్యాణ్ కు కనీసం తన ఓటును తనకు వేసుకునే అదృష్టం లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును కలిగి ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో కాకుండా ఏకంగా మంగళగిరిలో ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.


 ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి పార్టీ నుంచి చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి మంగళగిరిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక లోకేష్ గెలుపు కోసం ఓటు వేశారు అని చెప్పాలి. అయితే ముందు నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని ఉత్కంఠ ఉండగా.. చివరి నిమిషంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని కన్ఫార్మ్ కావడంతో ఇక ఓటు హక్కును  ఇలా మంగళగిరి నుంచి పిఠాపురం కి ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయారు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: