ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా రసవత్తంగా సాగుతున్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కుని సైతం వినియోగించుకుంటున్నారు.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు పలు రకాల పార్టీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా తన మద్దతుని సైతం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన అటు కూటమికి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


సినీ హీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న రాజకీయాలలోకి రాణిస్తారు అనుకుంటే అనూహ్యంగా నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో గుండెపోటు రావడంతో ఎవరు ఊహించని విధంగా కొద్ది రోజులకే మృతి చెందారు. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువే.. తారకరత్న మరణించిన సమయంలో కూడా వారి కుటుంబానికి విజయసాయిరెడ్డి చాలా అండగా నిలబడ్డారు. ఈ ఘటన తరువాత కూడా తారకరత్న ఫ్యామిలీకి చేదోడు వాదోడుగానే ఉంటున్నారు విజయసాయిరెడ్డి.


ఇప్పుడు తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటోని పంచుకోవడం జరిగింది.. తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఇలా రాసు కొస్తూ.."ఫ్యాన్ ఓట్ ఫర్ ది బెటర్ ఫ్యూచర్ అంటు" తారకరత్న తను కలిసి ఉన్న ఒక ఫోటోని సైతం షేర్ చేయడం జరిగింది.. దీన్ని బట్టి చూస్తే తారకరత్న భార్య కూడా వైసిపి పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని పలువురు అభిమానులు , కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు. కేవలం ఇదంతా విజయ్ సాయి రెడ్డి వల్లే అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. గడచిన కొద్ది రోజుల క్రితం కూడా బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ ఒక పోస్టుని షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. ఇప్పుడు తాజాగా ఇలాంటి పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: